చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి ఎన్నో ఉన్నత ఆశయాలతో కాలేజీల్లోకి అడుగు పెడతారు విద్యార్థులు. కానీ అక్కడ సీనియర్స్ అనే రాకాసి భూతం ఉంటుందని దాని వల్ల తమ జీవితాలకే అపాయం ఉంటుందని ఊహించరు. ర్యాగింగ్ పేరిట జూనియర్స్ ని వేదించడం, కొట్టడం ఎదురు తిరిగితే చంపేయడానికి కూడా సిద్దం కావడం ర్యాగింగ్ సంస్కృతిగా మారింది. దీనిపై ప్రభుత్వాలు ఎన్నో కఠిన చట్టాలు తీసుకు వచ్చారు. కాలేజీల్లో ర్యాగింగ్ నిషేదం అంటూ ఎన్ని చట్టాలు తీసుకు వచ్చినా.. ఈ ర్యాగింగ్ కల్చర్ మాత్రం తగ్గడం లేదు.. సీనియర్స్, జూనియర్ పై పైశాచిక చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు.  

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్యపై అసలు నిజాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మొదటి సంవత్సరం చదువుతున్న రిషికేశ్వరి చిన్నచిన్న వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడింది. రిషికేశ్వరి ఆత్మహత్యపై తెలుగు రాష్ట్రాల విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ''వీ వాంట్ జస్టీస్ ఫర్ రిషికేశ్వరి- రైజ్ యువర్ వాయిస్ కమ్యూనిటీ'' పేరిట గల ఫేస్ బుక్ పేజీకి విశేషమైన స్పందన లభిస్తోంది.  రిషికేశ్వరి కేసును విచారణ జరిపేందుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి బాలసుబ్రమణ్యం నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏపీ సర్కారు ఏర్పాటుచేయగా, ఈ కమిటీ బుధవారం నుంచి విచారణ చేపట్టింది.  


రిషికేశ్వరి డైరీలో సూసైడ్ నోట్


రుషికేశ్వరి మృతిపై రెండో రోజు బాలసుబ్రమణ్యం కమిటీ విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో  తోటి విద్యార్థులు, రుషికేశ్వరి తల్లిదండ్రులును కమిటీ సభ్యులు విచారిస్తారు. వర్శిటీలోకి మీడియా అనుమతిని నిరాకరించారు. వర్శిటీ అధ్యాపకులు, హాస్టల్‌ వార్డెన్‌లను విచారించనుంది. మిటీ జరుపుతున్న విచారణపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బహిరంగ విచారణ అంటూనే, వర్సిటీలోకి ఎవరినీ అనుమతించకుండా విచారణ చేపడుతున్నారంటూ విద్యార్థి జేఏసీ ఆందోళనకు దిగింది.  అయితే  వర్సిటీకి సెలవు ఎందుకు ప్రకటించారు అని కమిటీ ప్రశ్నించింది. అంతే కాదు ఈమెయిల్‌ ద్వారా విద్యార్థుల అభిప్రాయాలను సేకరించి, అయిదు రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక అందిస్తాని బాలసుబ్రమణ్యం చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: