హైదరాబాద్ పై మరో సంచలన కామెంట్ చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. హైదరాబాద్‌కు తెలంగాణ రాష్ట్ర సమితి ఏం చేసింది ?   తెలంగాణకు, హైదరాబాద్‌కు తెలుగుదేశం పార్టీ ఎంతో చేసింది అని అన్నారు. హైదరాబాద్  ఐటీ రంగం మా హయాంలోనే ఎంతో ఉన్నత స్థాయికి వెళ్లింది. ఇక్కడ రోడ్ల విస్తరణ మా ప్రభుత్వంలోనే మెరుగు పడింది అని అన్నారు. మరి ఇంత చేసిన మేము హైదరాబాద్ గురించి మాట్లాడొద్దు అంటే ఎందుకు ఊరుకుంటాం..హైదరాబాద్ గురించి మాట్లాడే హక్కు టీడీపీకా..? టీఆర్‌ఎస్‌కా..? అని ప్రశ్నించారు.

 తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు.   హైదరాబాదులో రాత్రిపూట రోడ్లు ఊడ్చే విధానాన్ని తానే ప్రవేశ పెట్టానని.. ప్రజలు లేచి రోడ్ల పైకి వచ్చేసరికి శుభ్రంగా ఉండేవని తెలిపారు. డీపీ హయాంలోనే అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో ప్రాజెక్టులు అన్నీ రూపుదిద్దుకున్నాయి అన్నారు.  టీఆర్ఎస్  ప్రభుత్వం  ఎన్టీఆర్ గురించి నేను అన్న మాటలు వక్రీకరించి మాట్లాడున్నారు.

హైదరాబాద్ లోని చార్మినార్


తాను అన్నదాంట్లో తప్పేముంది? ఎన్టీ ఆర్‌ తెల్లవారుజామున 3 గంటలకు లేచేవారు. ఆయనను కలుసుకోదల్చిన మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఉదయం 5 గంటలకే రావాల్సి వచ్చేది. ఆ అలవాటు ఎన్టీఆర్‌తోనే మొదలైంది. అప్పట్లో అప్పట్లో కేసిఆర్ కూడా అదే సమయానికి వచ్చేవారని అది ఎన్టీఆర్‌తోనే మొదలైందని ఘాటుగా చెప్పారు. ఇప్పుడు ఆన తన దినచర్యను ఎప్పుడు మొదలు పెడుతున్నారో, ఆ పార్టీ వారికే తెలుసునని ఎద్దేవ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: