ముంబాయి వ‌రుస పేలుళ్ల తో భార‌త దేశ వ్యాపార రాజ‌ధాని పై విరుచుకుపడ్డ ఐఎస్ఐ ఉగ్ర‌వాదుల ప‌థ‌కానికి అమలుకు స‌హ‌క‌రించిన ఉగ్ర‌వాది యాకుబ్ మెమ‌న్ క‌థ ముగిసింది. సుదీర్ఘ వాద‌న‌ల అనంత‌రం దేశ న్యాయ‌స్థానం స‌రైన నిర్ణ‌యం తీసుకుంది. నిబంధ‌న‌ల ప్ర‌కారం ఈరోజు ఉద‌యం 1 గంట‌కు యాకుబ్  నిద్ర‌లేపిన నాగ్ పూర్ జైలు అధికారులు స‌మారు 6.30 గంట‌ల‌కు ఉరిని అమ‌లు చేశారు. భార‌త‌దేశం పై యుద్దం ప్ర‌క‌టించిన ముష్క‌రుల‌కు శిక్ష వేయ‌టం పై దేశ ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. ఈ దుశ్చ‌ర్య‌లో ప్ర‌ధాన భూమిక పోషించిన మ‌రో కీల‌క ఉగ్ర‌వాదులైన‌ టైగర్ మెమ‌న్, ఆయూబ్ మెమ‌న్, దావుద్ ఇబ్ర‌హీం లకు శిక్ష ప‌డితే కానీ, వీరి కార‌ణంతో చ‌నిపోయిన 257 మంది ఆత్మ‌కు శాంతి ఉండ‌దని కొంత మంది వాద‌న‌. అంతేకాకుండా అస‌లు దోషుల‌ను వ‌దిలి పెట్టి, స‌హ‌క‌రించినందుకు ఉరి శిక్ష వేశారని ఆరోప‌న‌లు లేక‌పోలేదు. 


1993 లో మార్చి 12 ముంబాయి న‌గ‌రంలో చోటుచేసుకున్న విధ్వంస కాండ జాతీ చ‌రిత్ర‌లో ఓ విషాద ఘ‌టం. ముంబాయి స్టాక్ ఎక్స్చేంచ్ బిల్డింగ్ నుంచి పాస్ పోర్టు ఆఫీస్ వ‌రకు వ‌రుస‌గా 13 పేలుళ్ల తో ముంబాయి ప్రాంతం ద‌ద్ద‌రిల్లిపోయింది. కారు బాంబులు, స్కూట‌ర్ బాంబుల విస్పోట‌నాల‌తో ప్ర‌జ‌ల‌కు దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డిపోయారు. రంగంలోకి దిగిన సీబీఐ ద‌ర్యాప్తు ను ముమ్మురం  చేశారు. ఈ పేలుళ్ల‌కు మాఫీయా డాన్ దావూద్ ఇబ్ర‌హీం, టైగ‌ర్ మెమ‌న్, ఆయూబ్ మెమ‌న్, యాకుబ్ మెమ‌న్ త‌దిత‌రుల ప్ర‌మేయం ఉంద‌ని నిర్ధారించారు. పేలుళ్ల అనంత‌రం మెమ‌న్ కుటుంబ స‌భ్యులు దుబాయ్ కి పారిపోయారు. అనంత‌రం సీబీఐ యాకుబ్ ను నేపాల్ లో అదుపులోకి తీసుకున్నార‌ని తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న లో ప్ర‌ధాన సూత్ర‌దారులైన దావూద్ ఇబ్ర‌హీం, టైగ‌ర్ మెమ‌న్, ఆయూబ్ మెమ‌న్, యాకుబ్ మెమ‌న్ ల‌తో స‌హా మ‌రో 12 మందికి మ‌ర‌ణ‌శిక్ష విధించారు. అనంత‌రం టాడా కోర్టు యాకుబ్ ఉరి ఖారారు చేస్తూ, మ‌రో 9 మంది కి యావ‌జ్జీవ కార‌గార శిక్ష‌కు మార్చింది. సుదీర్ఘ వాద‌న‌ల అనంత‌రం దేశ అత్యున్న‌త న్యాయ స్థానం కూడా ఈ తీర్పును స‌మ‌ర్దించింది.  ప్ర‌స్తుతం ఉరిశిక్ష ప‌డ్డ దావూద్ ఇబ్ర‌హీం, టైగ‌ర్ మెమ‌న్, ఆయూబ్ మెమ‌న్ లు దేశం దాటి వెళ్లి త‌ల‌దాచుకుంటుంన్నారు.


ఉరిశిక్ష ప‌డ్డ యాకుబ్ మెమ‌న్


మ‌రోవైపు ఉరిశిక్ష అమ‌లు తో దేశంలో ఉగ్ర‌వాధాన్ని అరిక‌ట్ట‌లేమ‌ని, ఉరిశిక్ష సంస్రృతి మంచిదికాద‌ని కొన్ని ప్ర‌జా సంఘాలు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అంతేకాకుండా ఈ ఘ‌ట‌న లో ప్ర‌ధాన భూమిక పోషించిన టైగ‌ర్ మెమ‌న్, ఆయూబ్ మెమ‌న్, అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీం ల‌ను ప‌క్క‌న‌పెట్టి త‌మకు ప‌ట్టు బ‌డిన యాకుబ్ మెమ‌న్ ను ఉరికంభం ఎక్కించి ఇన్వెస్టిగేష‌వ్ ఎజెన్సీ లు చేతులు దులుపుకున్నాయన్న విమ‌ర్షలు వినిపిస్తున్నాయి. ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ లాడిస్తున్న ఉగ్ర‌వాదానికి ఇదేనా స‌మాదానం? అని సామాజిక ఉద్యమ‌కారులు ప్ర‌శ్నిస్తున్నారు. మెమ‌న్ ఈ దుర్ఘ‌ట‌న‌లో అసులు దోషి కాద‌న్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే. అస‌లు దోషులైనా టైగ‌ర్ మెమ‌న్, ఆయూబ్ మెమ‌న్, దావూద్ ను చ‌ట్టం ముందునిల‌బ‌డలేక‌పోయార‌ని విమ‌ర్శ‌లూ ఉన్నాయి. గ‌తంలో ముంబాయి అండర్ వ‌ర‌ల్డ్  డాన్  దావూద్ ఇబ్ర‌హీం కు నాటి రాష్ట్ర ప్ర‌భుత్వాల అండ దండ‌ల‌తోనే త‌న దందాను చేసుకునేవార‌ని అప్ప‌ట్లో టాక్. అ దంధాల‌తో ఆస్తులు కూడ గ‌ట్టిన దావూద్, తొండ ఊస‌ర‌వెళ్లి మారిన‌ట్లు దావూద్ కాస్తా ఉగ్ర‌వాది గా మారార‌ని మ‌హ‌రాష్ట్ర ప్ర‌జలు ఇప్ప‌టికి న‌మ్ముతారు. 


 యాకుబ్ మెమ‌న్ ఆగ‌ష్టు 17 న న్యూస్ ట్రాక్ అనే న్యూస్ చాన‌ల్  కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో దావూద్ ఇబ్ర‌హీం, టైగ‌ర్ మెమ‌న్, ఆయూబ్ మెమ‌న్ లు పాకిస్థాన్ లోనే ఉన్నార‌ని చెప్ప‌కనే చెప్పారు. అంతేకాకుండా టైగ‌ర్ కు పాకిస్ధాన్ లో చాలా నెట్ వ‌ర్క్ ఉంద‌ని తెలిపారు. ఈ బాంబు పేలుళ్ల కు పాకిస్థాన్ ప్ర‌భుత్వం స‌హ‌యం అందించింద‌ని కూడా తెలిపారు. అంతేకాకుంటా టైగ‌ర్ మెమ‌న్ ఉగ్ర‌వాదుల కార్య‌క‌ల‌పాల‌లో కీల‌క భూమిక పోషిస్తాడ‌ని తెలిపారు. దావూద్ ఇబ్ర‌హీం , టైగ‌ర్ మెమ‌న్, ఆయూబ్ మెమ‌న్ లు పాకిస్థాన్ లోనే త‌ల‌దాచుకున్నార‌ని వార్త‌లు గుప్పుముంటున్నా,  ప్ర‌ధాన సూత్ర‌దారుల‌ను ప‌ట్టుకొవ‌డంలో ప్ర‌భుత్వాలు విఫ‌ల‌మౌతున్నార‌న్న వాద‌న‌లు ఉన్నాయి. గ‌త‌ కొన్ని రోజుల క్రితం సీనియ‌ర్ రాం జెఠ్మలానీ మాట్లాడుతూ.. లండ‌న్ లో  దావూద్ క‌లిశారు. నేను  భార‌త్ కు లొంగిపోతాన‌ని ఉంది కానీ నాకు న్యాయం చేస్తే మాట ఇస్తే భార‌త్ వ‌స్తాడ‌ని తెలిపార‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపిన సంగ‌తి విదిత‌మే. పేను సంచ‌ల‌నం సృష్టించిన ఈ వ్యాఖ్యలు కొన్ని రోజుల త‌రువాత క‌నుమ‌రుగ‌య్యాయి. 


ఇప్పుడు భార‌త్ కు ఉన్న దావూద్, టైగ‌ర్ ల‌తో పెను ప్రమాదం వ‌చ్చినా ఆశ్చ‌ర్య పోవాల‌సిన అవ‌స‌రంలేదు. ఉగ్ర‌వాదాని హ‌తం చేయాల‌న్న భార‌త్ నిర్ణ‌యం చాలా మంచిదే. కానీ, కేవ‌లం ఒక్క‌రిద్ద‌రిని ఉరి తీయ‌డంతో ఉగ్ర‌వాదం హ‌తం అవుతుంద‌న్నది క‌లే అవుతుంద‌ని మేధావులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ కేసులో ప్ర‌దాన నిందితులు త‌ప్పించుకుతిరుగుతున్నారు. అప్ప‌ట్లో  ముంబాయి పేలుళ్ల‌ను ముందుగా పసిగట్టంలో నిఘా వ‌ర్గాలు, కోస్ట్ గార్డులు విఫ‌ల‌మ‌య్యాయ‌ని సుప్రీం కోర్టుకు అభిప్రాయ‌ప‌డింది. ఈ పేలుళ్ల అనంత‌రం అండ‌ర్ వ‌రల్డ్ డాన్ గ్యాంగ్ విడిపోయయాని తెలుస్తోంది. మాఫీయా డాన్ దావూద్ గ్యాంగ్ నుంచి చోట ష‌కీల్, సాధూ షెట్టి లంటి వారు విడిపోయి బ‌య‌ట‌కు వ‌చ్చారు.


ఈ పేలుళ్లకు పాకిస్థాన్ ఐఎస్ఐ హ‌స్త‌ముంద‌ని,  అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ ద‌వూద్ ఇబ్ర‌హీం సూచన‌ల మేర‌కు ఆయ‌న స‌హాచ‌రులు టైగ‌ర్ మెమ‌న్, ఆయూబ్ మెమ‌న్, యాకుబ్ మెమ‌న్ లుప్ర‌ణాళిక రూపోందించార‌ని విచార‌ణ సంఘం గుర్తించాయి. గ్రౌండ్ లెవ‌ల్ లో పేలుళ్ల కు స‌హ‌క‌రించిన‌ వారంతా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న‌వారే. బాబ్రీ మ‌సీదు కూల్చివేత కు ప్ర‌తికారంగా నే ఈ పేలుళ్లు జ‌రిగాయ‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. పేలుళ్లు జ‌రిపేందుకు నియ‌మించుకున్న వారికి పాకిస్థాన్, దుబాయి లో శిక్ష‌ణ ఇచ్చారు. వీరికి బాంబులను ఎలా పేల్చాలో నేర్పారు. పేలుడు ప‌దార్ధాలు పాకిస్థాన్ ప్ర‌భుత్వం స‌మ‌కూర్చింది. ఇందులో దావూద్ ఇబ్ర‌హీం, టైగర్ మెమ‌న్, ఆయూబ్ మెమ‌న్, యాకుబ్ మెమ‌న్ కీల‌క పాత్ర వ‌హించారు. ఇందులోయాకుబ్ ఉరిశిక్ష అమ‌లు తో మిగిలిన దావూద్, టైగ‌ర్, ఆయూబ్ లు పాకిస్థాన్ లోనే ఉన్నారా? లేకా మ‌రే దేశంలో నైనా ఉన్నారా..? అన్న‌ది క్లారిటీ లేదు. ఈ దిశ గా ప్ర‌య‌త్నిస్తున్న భార‌త ప్ర‌భుత్వాలు  ఈ ముష్క‌రుల పై ఏలాంటి నిర్ణ‌యం తీసుకొనున్నారో చూడాలి మ‌రి..!  


మరింత సమాచారం తెలుసుకోండి: