ఆయనో తెలంగాణ రాజకీయ నాయకుడు. ప్రతిపక్ష తెలుగుదేశంలో కీలక పాత్ర పోషిస్తున్నవాడు. కాకపోతే ఈ మధ్య ఆయన ఫేట్ కాస్త తిరగబడింది. పార్టీలో తనకు రావాల్సిన గుర్తింపును ఓ కుర్ర నాయకుడు తన్నుకుపోతుండటం ఆయన్ను కాస్త కలవరపెడుతోంది. ఓటుకు నోటు కేసులో బాగా ఇరుక్కున్నాడు కదా అని సంబరపడితే.. ఆ కేసు ఇమేజ్ తోనే ఆ కుర్ర నాయకుడు అమాంతం హీరో అయి కూర్చోవడం పాపం.. ఆయన్ను ఇబ్బందిపెడుతోంది. ఆయనే ఎర్రబెల్లి దయాకర్ రావు. 

ఇక ఆ కుర్రనాయకుడు రేవంత్ రెడ్డి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా. రేవంత్ ఫేమ్ లోకి రాకముందు వరకూ తెలంగాణ తెలుగుదేశంలో ఎర్రబెల్లే మొనగాడు. పేరుకు పార్టీ అధ్యక్షుడుగా ఎల్. రమణ ఉన్నా.. బీసీ కార్డుతో ఆ గౌరవం దక్కిందేకానీ.. రాజకీయ నిర్ణయాల్లో ఎర్రబెల్లిదే పైచేయిగా ఉండేది. ఓటుకు నోటు కేసుతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అందులోనూ తానే కాబోయే తెలంగాణ తెలుగుదేశం ప్రెసిడెంటునని రేవంత్ ఆ వీడియోల్లో చెప్పుకున్నాడు కూడా.

మూర్ఖున్ని సీఎం చేశామని జనం బాధపడుతున్నారు... 

Image result for errabelli dayakar on kcr
ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ పై ఎర్రబెల్లి విమర్శలు వెరీ కామన్. కాకపోతే ఈ సారి ఆయన ఘాటుగా విమర్సించింది పక్క రాష్ట్రం నుంచి. ఔను ఎర్రబెల్లి దయాకర్ రావు.. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం వెళ్లారు. సత్యనారాయణ స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రామేశ్వరం వెల్లినా శనీశ్వరం వదల్లేదన్నట్టు.. దైవదర్శనం కోసం వెళ్లినా మీడియా గొట్టాల బాధ తప్పలేదు. 

రాజకీయ నాయకులకు కూడా మీడియా గొట్టాలను చూడగానే ఆవేశం ఒక్కసారిగా వచ్చేస్తుంది. తామెక్కడున్నాం.. ఏ పరిస్థితుల్లో ఉన్నామన్నది కాసేపు పక్కన పెట్టేస్తారు. ఎర్రబెల్లి కూడా అంతే.. దైవదర్శనానికి వచ్చినా రాజధూషణ మానలేదు. అందులోనూ ఏదో రొటీన్ గా రెండు కామెంట్లు చేసి ఊరుకోలేదు. తెలంగాణలో మూర్ఖుడిని ముఖ్యమంత్రిని చేశామని ప్రజలు బాధపడుతున్నారని ఘాటుగా విమర్శించేశారు. తెలంగాణ ఏర్పాటు కోసమే జనం కేసీఆర్ ను సపోర్ట్ చేశారని.. ఇప్పుడు మాత్రం పరిస్థితి 
పూర్తిగా మారిపోయందని చెబుతున్నారు. అంతేకాదు.. ఓ ఏడాది ఆగితే.. గులాబీ నేతలు తెలుగుదేశం గూటికి క్యూకడతారని జోస్యం చెప్పారు ఎర్రబెల్లి. 



మరింత సమాచారం తెలుసుకోండి: