తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా గురించి అన్ని వర్గాల నుంచి భిన్న స్వారాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష హోదాలో ఉన్న వైఎస్సఆర్ సీపి ఈ విషయం పై గట్టి పట్టే పట్టింది. ఇమ మరో వైపు నటుడు శివాజీ ఏపీకి ప్రత్యేక హోదా గురించి పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌ రోజు రోజుకు తీవ్రతరమవుతోంది. గుంటూరులో నాలుగు రోజుల పాటు ఇదే అంశంపై ఆమరణ దీక్షకు దిగి ఆస్పత్రిపాలైన హీరో శివాజీ ఘటనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తేరుకోకపోగా ఎప్పటికీ అది మరుగున పడిపోయే అంశంగానే మిగిలిపోతుందని అన్నారు.  

మరో వైపు కేంద్రంలో జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ఆ రాష్ట్ర ఎంపీలు సైతం గొంతెత్తి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌ అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, సినీ నటుడు శివాజీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ప్రశ్నించారు. హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో శివాజీ మాట్లాడుతూ…. ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు మనం వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. ఇక ప్రత్యేక హోదాపై ట్విట్లు.. ప్రెస్ మీట్లు బంద్ చేసిన రోడ్డు మీదకు రావాలని అప్పుడే దీనిపై గట్టిగా స్పందించినట్లు అవుతుందని అన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని ధర్నా చేస్తున్న నటుడు శివాజీ

 పవన్ కల్యాణ్ రోడ్డు మీదికి వస్తే కేవలం ఐదు నిమిషాల్లో పనైపోతుందని శివాజీ తన అభిప్రాయని వ్యక్తం చేశారు. ఎంపీలను తిట్టడం తప్పుకాదు అని, కాని ఎవర్నో తిట్టాల్సిన అవసరం లేదని, మోదీనే నిలదీయడానికి రావలని శివాజీ, పవన్ కల్యాణ్ కు సూచించారు. అంతే కాదు వైఎస్సార్సీపీ నేతలు ఏం ఉద్దరించడానికి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడానికి వెళ్తున్నారని శివాజీ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వం కేంద్రానికి అడగాలంటే భయం పట్టుకుంది అంటూ ఎద్దేవా చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: