గురుర్ర్బహ్మ గురుర్విష్ణర్ గురుర్దేవో మహేశ్వరః 
గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః


గురు పౌర్ణమి వేడుకలు హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దిల్‌షుక్‌నగర్‌లోని సాయిబాబా ఆలయంలో తెల్లవారుఝాము నుంచే భక్తులు పోటెత్తారు. గరుపౌర్ణమి రోజు సాయినాథుడికి పాలాభిషేకం చేస్తే.. సకల పాపాలు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం. 5 లక్షలకు పైగా భక్తులు.. దర్శించుకుంటారని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు.గురు పౌర్ణమి వేడుకలు హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

కొలువైన సాయిబాబ


దిల్‌షుక్‌నగర్‌లోని సాయిబాబా ఆలయంలో తెల్లవారుఝాము నుంచే భక్తులు పోటెత్తారు. గరుపౌర్ణమి రోజు సాయినాథుడికి పాలాభిషేకం చేస్తే.. సకల పాపాలు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం. 5 లక్షలకు పైగా భక్తులు.. దర్శించుకుంటారని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. గురుపౌర్ణమి పండుగను పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.  సాయిబాబా దేవాలయానికి భక్తులు చాలా పెద్ద సంఖ్యలో సాయి దర్శనం కోసం క్యూ కట్టారు. చాలా మంది భక్తులు సాయి పారాయణం చేస్తూ భక్తిని చాటుకున్నారు. 12 గంటలకు కాగడహారతి పూజా కావడంతో భక్తులు హారతి కోసం గంటసేపు క్యూలో నిలబడి హారతి పూజలో పాల్గొన్నారు.సాయిబాబా దేవాలయంలో ఉదయం 5గంటల నుంచి పూజలు ప్రారంభించారు.

సాయిబాబా మందిరం..


సాయిబాబాకు పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం, అష్టోత్తర పుష్పార్చాన పూజలు నిర్వహించారు. సాయంకాలం పల్లకి సేవ నిర్వహించారు. టిజియల్ కాలనీలో ఉన్న సాయిబాబా దేవాలయంలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి సాయిబాబా దేవాలయాలు భక్తులతో కిట కిటలాడాయి. ఎంతో భక్తిశ్రద్దలతో గురు పౌర్ణమి ఉత్సవాలను భక్తులు నిర్వహించారు. హైదరాబాద్ నగరంలోని దిల్‌సుఖ్‌నగర్, పంజాగుట్ట, ఫిలింనగర్ దైవ సన్నిధానంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇవాళ పౌర్ణమి సందర్భంగా శ్రీవారు భక్తులకు గరుడవాహనంపై దర్శనమివ్వనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: