తెలుగు రాష్ట్రాల్లో పెను వివాదంగా మారిన ఓటుకు నోటు వ్యవహారం లో ఏ1 నింధితుడిగా అరెస్టు అయిన టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే.. తాజాగా రేవంత్‌రెడ్డి తన బెయిల్‌ షరతులను సడలించాలంటూ చేసిన అభ్యర్థనను హైకోర్టు గురువారం తిరస్కరించింది.ఈ కేసులో రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిలు మంజూరు చేస్తూ నియోజకవర్గ పరిధి దాటి వెళ్లరాదంటూ షరతు విధించిన విషయం తెలిసిందే. 


 తెలుగుదేశం పార్టీలో తాను సీనియర్‌ నేతనని, రాజధానిలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండటంతో అందుకు వీలుగా బెయిలు షరతులను సడలించాలని కోరుతూ రేవంత్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఈయన పిటీషన్ కు వ్యతిరేకంగా  కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని ఈ దశలో నిందితుడికి బెయిలు షరతులను సడలించరాదంటూ అవినీతి నిరోధక శాఖ తరఫు న్యాయవాది వి రవికిరణ్‌రావు అభ్యంతరం తెలిపారు. రేవంత్ రెడ్డి బయటి వాతావరణంలోకి వస్తే కేసు సాక్షులను ప్రభావితం చేసే అస్కారం ఉందని ఆయన అన్నారు.

ఓటుకు నోటు వ్యవహారంలో కీలక సాక్ష్యం రేవంత్ రెడ్డి, స్టిఫెన్ సన్ సిసి కెమెరా దృశ్యాలు


ఒకవేళ ఆరోగ్య కారణాలు, కుంటుబ కార్యక్రమాలు తప్పని సరి అనుకుంటే సడలింపు కోరితే పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. రుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి జస్టిస్‌ రాజాఇళంగో బెయిలు షరతులను సడలించే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఏసీబీ న్యాయవాది వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి రేవంత్ రెడ్డి పిటిషన్‌ను కొట్టిపారేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: