తెలుగు రాష్ట్రాలో పెను సంచలనాలకు దారి తీసిన ఓటుకు నోటు వ్యవహారం ఇప్పట్లో ముగిసేలా లేదు.. ఆ మద్య జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టిఫెన్ సన్ తో టీటీడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బేర సారాలకు సంబంధించి ఏసీబి వారు సిసి కెమెరాలతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విషయం తెలిసిందే.. అయితే ఈ కుట్ర టీఆర్ఎస్ కావాలనే చేసిందని టీటీడిపి వర్గం ఆరోపించారు.

ఏది  ఏమైనా నేరం రుజువైంది కాబట్టి రేవంత్ రెడ్డిని ఏ1 నిందితునిగా పరిగణించి చర్లపల్లి జైలుకు తరలించారు. ఆ తర్వాత కొన్ని షరతులతో కూడి బెయిల్ మంజూరు చేశారు. ఈయతో పాటు ఉదయ్ సింగ్, సెబాస్టియన్లను కూడా అరెస్టు చేసి బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే..అయితే ఈ విషయంలో మొదటి నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తలనొప్పి వ్యవహారంలానే ఉంది. ఇప్పుడు మరో చిక్కు వచ్చిపండింది టీడీపికి ఈ కేసులో ముద్దాయిగా ఉన్న సెబాస్టియన్ చేసిన ఘనకార్యమే ఇందుకు కారణం... ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా పలువురు టిడిపి నేతలను గండంలో పడేసింది.


ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డి, స్టిఫెన్ సనం సిసికెమెరాలో...


సెబాస్టియన్ ఒకప్పుడు తన సెల్ ఫోన్ లోకి రికార్డింగ్ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నాడట.దాంతో అతను ఎవరితో మాట్లాడినా ,ఎవరు ఫోన్ చేసినా రికార్డింగ్ అయిపోతుందట. ఆ సంగతి అతడు మర్చిపోయాడు. దాంతో అన్ని కాల్స్ రికార్డింగ్ అయిపోతున్నాయి. అదే క్రమంలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్సన్ తో మాట్లాడిన సంభాషణ కూడా రికార్డు అయింది. ఇక ఓటుకు నోటు కేసులో సెబాస్టియన్ ను అరెస్టు చేసిన సందర్భంగా ఏసీబీ వారు అందరి ఫోన్లు స్వాదీనం చేసుకొని కాల్ డేటాను పరిశీలించారట. అయితే  సెబాస్టియన్ పోన్ ను పరిశోధిస్తే ఈ విషయాలన్ని బయటపడ్డాయని ఎసిబి వర్గాలు చెబుతున్నాయి. మరి ఏరికోరి తెచ్చుకున్న తంటాలకు ఫలితాలు అనుభవించాలి కదా..!


మరింత సమాచారం తెలుసుకోండి: