తెలంగాణలో కేసీఆర్ ఇప్పుడు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో మద్యం ప్రియులు బాగానే ఉన్నారని కొంత మంది కల్తీ కల్లు తాగి ప్రాణాల మీదకు తెచ్చకుంటున్నారని దీన్ని నిర్మూలించాలంటే కల్తీకల్లును  అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శుక్రవారం నూతన ఎక్సైజ్‌ పాలసీపై జరిపిన సమీక్షలో అధికారులకు సీఎం కేసీఆర్‌ ఈమేరకు సూచించారు. కల్తీకల్లును అర్టికట్టేందుకు ఈతచెట్లను పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఈ బాధ్యతను ఎక్సైజ్ శాఖ తీసుకోవాలని ,ఈత నర్సరీలను తయారుచేయాలని ఆయన సూచించారట.

మంచి కల్లు కోసం ఈత చెట్లను పెంచాలని.. కాయకష్టం చేసుకుని వచ్చిన శ్రామికులు విశ్రాంతి కోసం మద్యం తీసుకుంటారని అందువల్ల వారి ఆరోగ్యానికి నష్టం లేని విధంగా మంచి మద్యం అందించాలని కెసిఆర్ సూచించారట.ఎక్సైజ్‌ వారికి తెలంగాణలో చెరువు కట్టల మీద ఐదు కోట్ల ఈతచెట్లను పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు.,ఈత నర్సరీలను తయారుచేయాలని ఆయన సూచించారు. తెలంగాణలో అమ్ముడయ్యే మద్యం ఇక్కడే తయారు చేయాలన్నారు.

ఈత చెట్లు 


అన్ని బ్రాండ్ల డిస్టిలరీలు ఏర్పాటయ్యేలా చూడాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేసింది. గతంలో పాలకులు ప్రభుత్వ రాబడి గురించే చూశారు తప్ప ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకోలేదని అప్పట్లో ఎన్నో కల్తీ మద్యం కేసులు నమోదు అయ్యాయని ఎంతో మంది చనిపోయారని కేసీఆర్ అన్నారు. తమ పరిపాలనలో అలాంటి పొరపాటు జరగడానికి వీళ్లేదని తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని తన కోరిక అని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: