నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పోలీసుల దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. షితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఇద్దరు యువకులు, ఓ యువతితో పాటు మరో వ్యక్తి ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. త్వరలోనే అతన్ని అరెస్టు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. నాగార్జున విశ్వవిద్యాలయం బాలికల వసతి గృహాల చీఫ్ వార్డెన్ స్వరూపరాణి స్పందించారు. రిషికేశ్వరి కేసులో ఆమె శనివారంనాడు జిల్లా లోక్‌ అదాలత్ ముందు హాజరయ్యారు.

హాస్టల్‌లో ర్యాగింగ్ ఉన్న మాట వాస్తవమేనని ఆమె ఈ సందర్భంగా అంగీకరించారు. అయితే రిషికేశ్వరి విషయంలో ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పారు రిషికేశ్వరి మరణించిన రోజున తాను హాస్టల్‌కు వచ్చేసరికి మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలిస్తున్నారని ఆమె చెప్పారు. ఆ తర్వాత రిషికేశ్వరి మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారని స్వరూపరాణి చెప్పారు. ఇక రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిన రోజు రాత్రి నిందితులతో కలిసి ఆమె మంగళగిరిలోని థియేటర్‌కు సినిమాకు వెళ్లినట్లు ఇదివరకు పోలీసులు చెప్పారు. అయితే విజయవాడలోని మల్టీప్లెక్స్ థియేటర్‌కు వారంతా సినిమాకు వెళ్లారని తాజాగా పోలీసులు గుర్తించారు. రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చిన తర్వాత హాస్టల్‌లో ఏం జరిగిందన్న అంశంపైనే పోలీసులు ఆరా తీస్తున్నారు. 

 

తెలుగు రాష్ట్రాలో సంచలనం రేపిన రుషికేశ్వరి ఆత్మహత్య వెనుక నిజాలు బయటకు రాబట్టాలని ఆమెకు న్యాయం చేసే వరకు విశ్రమించేది లేదని విద్యార్థి లోకం అంటుంది. ర్యాగింగ్ రక్కసికి బలైపోయిన ఓ అమాయకురాలి ఆత్మకు శాంతి చేకూరాలని.. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకూడదని లోకం నడుంబిగించింది. అంతకంతకు రిషితేశ్వరికి మద్దతు పెరుగుతోంది.కొన్ని మీడియా ఛానళ్లు చేస్తున్న ప్రసారాలు, వేస్తున్న కథనాలు,  సోషల్ మీడిచాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్న తీరు రిషితేశ్వరి కేసుపై మరింత మద్దతును మూటగడుతున్నాయి. ర్యాగింగ్ పై ప్రభుత్వాలు చట్టాలు తీసుకు వచ్చినప్పటికీ ఇలాంటివి జరుగుతున్నాయంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. అమాకంగా కనిపించినంత మాత్రన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించండి విద్యార్థులకు ఎవరి హక్కు కల్పించారని ఇది చూస్తూ కూడా యాజమాన్యం, ప్రిన్సిపాల్ చూస్తూ ఎలా ఉరుకున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. చనిపోయిన రిషితేశ్వరిని ఎలాగూ తీసుకురావడం కుదరదు.. కానీ జరిగిన అన్యాయానికి మాత్రం న్యాయం జరగాల్సిందే.  



మరింత సమాచారం తెలుసుకోండి: