దేశంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చించి వారి స‌మ‌స్య‌ల‌కు ఎలా ఉన్నాయి, వాటిని ఎలా నిర్మూలించాలి. వంటి వాటిన చ‌ర్చించి అంద‌రు ఎంపీలు కలిసి ప్ర‌జా అభివృద్ది కి సంబంధించిన బిల్లుల పై ఆమోదం తెలుపుతారు. దీంతో ప్ర‌జ‌ల‌కు రావ‌ల‌సిన ప‌థ‌కాలు రాష్ట్రాల‌కు వ‌స్తాయి. కానీ ప్ర‌స్తుతం పార్ల‌మెంట్ జ‌రుగుతున్న‌దేమిటి? అస‌లు వీరు ప్ర‌జా స‌మ‌స్య‌ల గురించి పార్ల‌మెంట్ స‌భ‌లు ఏర్పాటు చేశారా? లేకా వారి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం చ‌ర్చించుకొవ‌డానికి వ‌చ్చారా అన్న సందేహం రాక మాన‌దు.పార్లమెంటు నిర్వహణకు రోజుకు రెండు కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించడం వల్ల కోట్లాది రూపాయల నష్టం జరుగుతున్నదని కొందరు అంటున్నారు. కానీ పార్లమెంటు చర్చలకు భంగం కలగడం వల్ల జరిగే నష్టం ఏ లెక్కలకు అందనిది. పార్లమెంటు దేశాన్ని నడిపించే ప్రజా ప్రాతినిధ్య సంస్థ. దేశాన్ని పీడిస్తున్న అనేక సమస్యలకు పరిష్కారాలు సాధించడం ఈ నాయకుల బాధ్యత. గతంలో బీజేపీ కూటమి సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించింది కనుక ఇప్పుడు తామూ అదే పని చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పడం సమర్థనీయం కాదు.


ముఖ్య‌మంత్రి చౌహాన్ రాజీనామా చేస్తే నే స‌భా కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌నిస్తామ‌ని కాంగ్రెస్ పార్టీ ప‌ట్టుప‌డుతన్న‌ది


ఊహిచంన‌ట్టుగానే శుక్ర‌వారం కూడా పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లో గంద‌ర‌గోళం నెల‌కొన్న‌ది. స‌భా కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌తి ప‌క్షాలు ఆటంకం క‌లిగించాయి. ఈ ఒక్క రోజే కాదు, పార్ల‌మెంటు సమావేశాలు ప్రారంభ‌మైన గ‌త ప‌ది రోజుల‌లో ఏనాడూ స‌భ స‌జావుగా సాగింది లేదు. మాజీ రాష్ట్ర‌ప‌తి ఏపీజే అబ్దుల్ క‌లాం మ‌ర‌ణించినందున మూడు రోజుల పాటు స‌భా కార్య‌క్ర‌మాల‌ను వాయిదా వేశారు. ఆ త‌రువాత మ‌ళ్లీ ఇదే సీన్. అధికార ప‌క్షం స‌భా కార్య‌క్ర‌మాలు జ‌ర‌పాల‌ని ప్ర‌య‌త్నించ‌డం, ప్ర‌తిప‌క్షాలు ప్ల‌కార్డులు ప‌ట్ట‌కొని పోడియం ద‌గ్గ‌రికి చేరుకుని నినాదాలు చేయ‌డం రివాజుగా మారింది. ఐపీఎల్ కుంభ‌కోణంలో కీల‌క పాత్ర‌ధారి ల‌లిత్ మోడీకి తెర‌వెనుక సాయం అందించిన కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ , రాజ‌స్థాన్ సీఎం వ‌సుంధ‌రా రాజే తో పాటు వ్యాపం కుంభ‌కోణంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మ‌ధ్య ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చౌహాన్ రాజీనామా చేస్తే నే స‌భా కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌నిస్తామ‌ని కాంగ్రెస్ పార్టీ ప‌ట్టుప‌డుతన్న‌ది.


గతంలో మంత్రుల రాజీనామాలను డిమాండ్ చేస్తూ సభాకార్యక్రమాలకు అడ్డుతగిలిన సంప్రదాయాన్ని బీజేపీయే ప్రారంభించిందని లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే అంటున్నారు. ప్రతిపక్షాలతో చర్చించి సభా కార్యక్రమాలు జరిగేలా చేస్తానని ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే కాంగ్రెస్ పార్టీ వైఖరిని గమనిస్తే ఏకాభిప్రాయం సాధ్యమా అనే సందేహం కలుగుతున్నది.  సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర స్పష్టంగా కనిపిస్తున్నది. అయితే ఈ మొత్తం ఉదంతంలో బీజేపీ పాత్ర కూడా సమర్థించలేనటువంటిది. యూపీఏ హయాంలో బీజేపీ నిర్వహించిన చెడగొట్టు పాత్రనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రవర్తనకు బాట వేసింది. వాజపేయి హయాంలో కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా ఉండడం, మళ్ళా యూపీఏ పాలనలో బీజేపీ కూటమి శక్తిమంతమైన ప్రతిపక్షంగా నిలదొక్కుకోవడం ప్రజాస్వామ్యవాదులకు సంతోషాన్నిచ్చింది. ప్రభుత్వం, ప్రతిపక్షం జోడు గుర్రాల మాదిరిగా దేశాన్ని నడిపిస్తాయనుకున్నారు. 


బీజేపీ పోషించిన పాత్ర తీవ్ర విమర్శలకు గురయింది


కానీ యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా బీజేపీ పోషించిన పాత్ర తీవ్ర విమర్శలకు గురయింది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఎన్నడూ లేనంతగా బీజేపీ నేతృత్వంలోని ప్రతిక్షాలు పార్లమెంటు కార్యక్రమాలను స్తంభింపచేశాయి.  15వ లోక్‌సభ యావత్తూ గందరగోళంగా గడిచిపోయింది. ఏ అంశంపైనా చర్చలు ఫలవంతంగా సాగలేదు. నిరంతర వాయిదాలతో లోక్‌సభలో 42 శాతం, రాజ్యసభలో 20 శాతం చర్చాకాలం వృథా గా గడిచింది. 1950 దశకంలో లోక్‌సభ సగటు సమావేశ కాలం 127 రోజులైతే పదిహేనవ లోక్‌సభ సగటు సమావేశ కాలం 73 రోజులకు తగ్గిపోయింది. మొదటి లోక్‌సభ ఏడాది కాలంలో 72 బిల్లులు ఆమోదిస్తే పదిహేనవ లోక్‌సభ నలభై బిల్లులను మాత్రం ఆమోదించగలిగింది. కాలం గడిచే కొద్దీ సత్సంప్రదాయాలు నెలకొల్పవలసిన ప్రజా ప్రతినిధులు ప్రమాణాలను మరింత దిగజార్చడం శోచనీయం. పార్లమెంటు నిర్వహణకు రోజుకు రెండు కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. 


సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించడం వల్ల కోట్లాది రూపాయల నష్టం జరుగుతున్నదని కొందరు అంటున్నారు. కానీ పార్లమెంటు చర్చలకు భంగం కలగడం వల్ల జరిగే నష్టం ఏ లెక్కలకు అందనిది. పార్లమెంటు దేశాన్ని నడిపించే ప్రజా ప్రాతినిధ్య సంస్థ. దేశాన్ని పీడిస్తున్న అనేక సమస్యలకు పరిష్కారాలు సాధించడం ఈ నాయకుల బాధ్యత. గతంలో బీజేపీ కూటమి సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించింది కనుక ఇప్పుడు తామూ అదే పని చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పడం సమర్థనీయం కాదు. అనేక దశాబ్దాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ వ్యవహార సరళి ఎంతో బాధ్యతాయుతంగా, మిగతా పక్షాలకు కనువిప్పు కలిగిలేలా ఉండాలి. సభను సజావుగా నడిపించడానికి స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇటీవల అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు.


ఎంపీలు స‌భా మ‌ధ్య భాగంలోకి రావ‌డం, ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించ‌డం వంటి కొన్ని ప్ర‌వ‌ర్త‌న‌ల‌ను మానుకోవాల‌ని, ఈ ప‌రిమిత అవ‌గాహ‌నైనా సాధించాల‌ని స్పీక‌ర్ రాజ‌కీయ ప‌క్షాల‌ను కోరారు. బడి పిల్ల‌లు సంద‌ర్శ‌కుల గ‌డిలో కూర్చుని చూస్తుంటారిన ఇది వారిపై దుష్ప్ర‌భావాన్ని క‌లిగిస్తుంద‌ని స్పీక‌ర్ సుమీత్రా మ‌హ‌జ‌న్ అన్నారు. గ‌తంలో ఇటువంటి అంత‌రాయాలు క‌లిగాయి. క‌నుక ఇప్పుడు కూడా క‌లిగిద్దామా? అని ఆమె ప్ర‌శ్నించారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిందేదో జ‌రిగిపోయింది. ఇప్పుడు ప‌రిస్థితిని చక్క‌దిద్ద‌వ‌ల‌సిన బాధ్య‌త అన్ని ప‌క్షాల‌పైనా ఉన్న‌ది. బీజేపీ గ‌తంలో త‌మ ప్ర‌వ‌ర్త‌న‌కు విచారం వ్య‌క్తం చేయాలి. కాంగ్రెస్ పార్టీతో ఏదో ఒక స్థాయి లో అంగీకారాన్ని సాధించాలి. కాంగ్రెస్ పార్టీ కూడా మొండి ప‌ట్టు ప‌ట్ట‌కుండా చ‌ర్చ‌లు సాఫీగా సాగ‌డానికి స‌హ‌క‌రించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: