చంద్రబాబునాయుడు.. తన కిందిస్థాయి నాయకులు ( అనగా ఎమ్మెల్యేలు, ఇతర మంత్రులు) తో మాట్లాడేప్పుడు.. ఒక టెక్నిక్‌ను ప్రయోగిస్తుంటారు. ముందుగా వారి సామర్థ్యాల మీద వారికి అనుమానాలు కలిగిస్తారు. భయాన్ని కలిగిస్తారు. ఆ తర్వాత.. వారిమీద తాను పైచేయి సాధించి.. ఇక ఆ భయంలో ఉండగానే కమాండ్‌ చేయడం ప్రారంభిస్తారు. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు. విజయవాడలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీల మీద చేసిన సర్వే వివరాల్ని వెల్లడించారు. అయితే ఆ సందర్భంగా పొంతనలేని ప్రకటనలు చేయడమే విశేషం. 


'మీ పనితీరు చాలా అసంతృప్తిగా ఉంది', 'మీ పని కూడా నేనే చేయాల్సి వస్తోంది', 'మనం ఇంత పనిచేస్తున్నాం.. కానీఆ గొప్పతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీరు ఫెయిలవుతున్నారు' లాంటి వాక్యాలను నిత్యం వాడుతూ ఉండడం.. చంద్రబాబుకు మహా సరదా. మొన్నటికి మొన్న విజయవాడలోనే మంత్రివర్గ సమావేశం జరిగినప్పుడు కూడా ఇదే టెక్నిక్‌ ఫాలోఅయ్యారు. మీమీద ప్రజాభిప్రాయాలను కూడా తెప్పిస్తున్నా.. వాటిని బట్టి మనం కొత్త నిర్ణయాలు తీసుకోవాలి అంటూ మంత్రుల మీద బాంబు కూడా వేశారు. పార్టీ సమావేశంలో కూడా అదే టెక్నిక్‌ వాడారు. 175 నియోజకవర్గాల్లో సర్వే నివేదికలు తెప్పించా.. ఎవ్వరి పనితీరూ బాగాలేదు... అని పెదవి విరిచారట. 


అయితే బయటకు చెప్పాల్సి వచ్చేసరికి... నేను రాష్ట్రమంతా సర్వే చేయించాను.. ఇప్పటికిప్పుడు శాసనసభను రద్దు చేసి.. ఎన్నికలకువెళితే.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 30 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు అంటూ చాలా డాంబికంగా ప్రకటించారు. మరి చంద్రబాబు పార్టీ అందరూ ప్రజలకు అసంతృప్తి కలిగించేలా పనిచేస్తూ ఉంటే మిగిలిన 145 సీట్లలో తెదేపా వారు గెలుస్తారని ఆయన ఎలా అనుకుంటూ ఉన్నట్లు? ఎవరిని మాయ చేయడానికి ఇలాంటి అర్థంలేని ప్రకటనలు చేస్తున్నారు.. అంటూ.. పార్టీ నాయకులే తమలో తాము గుసగుసలాడుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: