మామగారి పార్టీలో చేరి.. ఆ పార్టీకే కింగుగా మారిన చంద్రబాబు... ఇంతవరకూ తెలుగు నేలపై ఏ నాయకుడూ దక్కించుకోనంతటి రికార్డు ఇప్పటికే సొంతం చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను దాదాపు 9 ఏళ్లు.. అంది కూడా నాన్ స్టాప్ గా పాలించిన ఘనత మన నారా వారిదే. ఆ తర్వాత ఏపీ విడిపోయిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి కూడా ఆయనే. ఈ రికార్డులకు తోడు.. పదేళ్లపాటు రెండోసారి సీఎంగా పని చేసిన వ్యక్తిగా కూడా బాబు రికార్డు పేరిట నమోదై తీరుతుందని నారా వారి వీరాభిమానుల ప్రగాఢ ఆకాంక్ష. 

మరి ఆ కోరిక తీరాలంటే.. 2019లోనూ టీడీపీయే గెలవాలి. మరోసారి చంద్రబాబు సీఎం కావాలి. మరి అలా అవుతుందా.. అంటే. అలా కావడం చాలా చాలా కష్టమట. ఈమాట అన్నది ఎవరో గిట్టని వైసీపీ నాయకులు అనుకుంటే పొరపాటే. ఆ వాస్తవం ఘంటాపథంగా చెబుతున్నది పరోక్షంగా బాబు గారే.. ఎందుకంటారా.. మరి ఆయన స్వయంగా చేయించుకున్న అంతర్గత సర్వేలోనే ఆయన పాలనా ఒకటి, రెండు విషయాల్లో తప్ప ఏమాత్రం బాగా లేదని తేలింది. ఆ రిపోర్టు సంగతీ ఆయనే బెజవాడ మీటింగులో పార్టీ నాయకులకు వివరించి చెప్పారు కూడా. 

ఏ పార్టీ అయినా గద్దెనెక్కిన రెండు,మూడేళ్లు బాగానే ఉంటుంది. చివరి రెండేళ్లలో ప్రభుత్వ వ్యతిరేకత వస్తుంది. పాలకుడి తీరును బట్టి ఆ వ్యతిరేకత డోసు ఉంటుంది. పాలకుడు మంచివాడైనా ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా ఓడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి పాలన చెత్తగా ఉంటే.. ఓడిపోవడం అనే విషయంలో అనుమానమే అక్కర్లేదు. అలా చూసుకుంటే.. బాబు గారి రెండో దఫా పాలన మొదటి ఏడాది పూర్తయ్యేసరికే ఇంత వ్యతిరేకత మూట గట్టుకుంటే.. ఇక చివరి రోజుల్లో ఇంకెలా ఉంటుందో.. చెప్పనక్కర్లేదు. 

సొంత పార్టీ చేయించిన సర్వేలోనే పాలన ఇంత దారుణంగా ఉందని తేలిందంటే.. వాస్తవానికి ఇంకెంత దారుణంగా ఉందో.. అని రాజకీయులు విస్తుపోతున్నారు. ఎందుకంటే.. తమకు అనుకూలమైన వాటిని కాస్త ఎక్కువగా.. ప్రతికూలమైన వాటిని మరింత తక్కువగా చూపడం సొంత సర్వేలో వెరీ రొటీన్ కదా. దీన్నిబట్టి చూస్తే.. చంద్రబాబు గారి పాలన ఇలాగే కొససాగితే.. మరింత వ్యతిరేకత రావడం ఖాయం. ఎందుకంటే.. చంద్రబాబు ఎన్నికల సభల్లో ఇచ్చిన హామీలు ఇన్నీ అన్నీ కావు.. వాటిలో రుణమాఫీ వంటి కూడా సరిగ్గా అమలవలేదు. ఇంకా అమలు చేయాల్సిన హామీలు.. వందల్లో ఉన్నాయి. సో.. సీన్ చూస్తుంటే.. సీఎంగా మరోసారి బాబుకు అవకాశాలు కష్టమన్నట్టేగా.. 


మరింత సమాచారం తెలుసుకోండి: