నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి కేసు పోలీసుల దర్యాప్తులో మరింత వేగవంతం చేస్తున్నారు. రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఇద్దరు యువకులు, ఓ యువతితో పాటు మరో వ్యక్తి ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. త్వరలోనే అతన్ని అరెస్టు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.  హాస్టల్‌లో ర్యాగింగ్ ఉన్న మాట వాస్తవమేనని హాస్టల్ వార్డెన కూడా అంగీకరించారు.

ఈ నేపథ్యంలో ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఇక ముందు ఏపీలో ర్యాగింగ్ అన్న మాట వినపడ కూడదని కళాశాలల యాజమాన్యానికి పిలుపు ఇచ్చారు. ఇకవేళ ఇలాంటి కేసులు ఎక్కడైనా మరోసారి రిపిట్ అయితే కళాశాల యాజమాన్యంపై కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏపీ ప్రభుత్వం విద్యాలయాల నుంచి ర్యాగింగ్ ను తరిమికొట్టేందుకు ఏపీ సర్కారు నడుం బిగించింది ఆయన అన్నారు. 


రుషికేశ్వరి నింధితులకు శిక్షపడాలంటున్న విద్యార్థిలోకం

Risithesvari case in order to ensure justice
ర్యాగింగ్ కు పాల్పడే వారికి జీవిత ఖైదు విధించేలా చట్టానికి సవరణ చేస్తామని చెప్పారు. అంతేకాక విద్యాలయాల్లో ర్యాగింగ్ నిరోధానికి సంబంధించి మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోనున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ దిశగా కసరత్తు చేస్తున్నామని గంటా వెల్లడించారు. మరో వైపు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీఆర్క్‌ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య సంఘటనపై ప్రభుత్వం నియమించిన బాలసుబ్రహ్మణ్యం కమిటీ తన నివేదికలో ఏముందనే విషయంపై తీవ్ర ఉత్కంఠ చోటు చేసుకుంది.


 రిషికేశ్వరి తల్లిదండ్రులతో మంత్రి గంటా శ్రీనివాసరావు


 విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్‌ చేశారు. జూలై 30న విద్యార్థులు, వసతి గృహ వార్డెన్లు, విద్యార్థి సంఘాల నాయకులు, రిషికేశ్వరి తల్లిదండ్రులను విచారించారు. జూలై 31న వర్సిటీ కార్యవర్గ సభ్యులు కమిటీని కలిసి తమ వద్ద ఉన్న సమాచారాన్ని అందజేశారు. ఆదివారం బాల సుబ్రహ్మణ్యం కమిటీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు హైదరాబాద్‌లో నివేదికను సమర్పించిన విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: