రేవంత్ రెడ్డి.. నిన్న మొన్నటివరకూ సాధారణ నాయకుడే అయినా.. ఇప్పుడు మాత్రం కాదు.. చంద్రబాబు ఇప్పుడు తెలంగాణలో పార్టీ భవిష్యత్తుపై ఆయనపైనే ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఓటుకు నోటు వంటి ఆపద సమయంలో ఆయనకు అండగా నిలిచారు. అబ్బే.. ఆ వ్యవహారం మాకేం సంబంధం అనుకుండా.. పార్టీ నుంచి తప్పించకుండా వెనకేసుకొచ్చారు. రేవంత్ పై చర్య తీసుకుంటే.. చివరకి అది తమకే బూమరాంగ్ అవుతుందని టీడీపీ అధినేతకు తెలుసనుకోండి.. 

ఏదేమైనా ఓటుకు నోటు వ్యవహారంతో రేవంత్ రెడ్డి ఒక్కసారిగా హీరో అయిపోయారు. చేసింది తప్పు పనే అయినా.. దాన్ని పట్టుకున్న విధానం కూడా తప్పుడుది కావడంతో నేరం ఇంటెన్సిటీ తగ్గిపోయింది. అందులోనూ డబ్బుకు నాయకులు అమ్ముడుపోవడం.. కామనైపోయిన ఈ రోజుల్లో.. రేవంత్ ను పెద్ద నేరగాడుగా భావించే పరిస్థితి లేదు. రేవంత్ దొరికాడు.. మిగిలినవాళ్లు దొరకలేదు.. అంతే కదా తేడా అన్న కామెంట్లూ వచ్చాయి. 

కాకపోతే.. ఓటుకు నోటు కేసు ద్వారా రేవంత్ కాళ్లకు ముందు  సంకెళ్లు పడ్డాయి. బెయిల్ పిటీషన్ ఇచ్చేటప్పుడు విధించిన షరతులే అందుకు కారణం. తన సొంత నియోజకవర్గం కోడంగల్ నుంచి ఇంచు కూడా అవతలకు పోకూడదని హైకోర్టు గట్టి గా చెప్పడంతో రేవంత్ పరిస్థితి కాలు కాలిన పిల్లిలా తయారయ్యింది. చివరకు హైదరాబాద్ లోనూ ఆయన ఎక్కువ సమయం గడిపే పరిస్థితిలేదు. ఐతే.. ఓసారి బెయిల్ వచ్చేశాక.. ఏవో కారణాలతో మినహాయింపులు పొందడం కామనే.

రేవంత్ కూడా అలాగే మినహాయింపులు పొందవచ్చని ఆశపడ్డారు. కానీ హైకోర్టు మాత్రం ఠాఠ్.. అలా వెళ్లడానికి వీళ్లేదంటూ కాళ్లకు సంకెళ్లు కంటిన్యూ చేస్తోంది. తన బెయిల్ షరతులను సడలించాలని టిడిపి తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పెట్టుకున్న పిటిషన్ ను హైకోర్టు రెండోసారి కూడా తిరస్కరించింది. కొద్ది రోజుల క్రితం కూడా రేవంత్ ఈ విషయంలో పిటిషన్ పెట్టుకున్నారు. తాను పార్టీలో సీనియర్ నేతనని, తనకు హైదరాబాద్ లో ఉండవలసిన అవసరం ఉందని చెప్పుకున్నా.. కోర్టు మాత్రం కనికరించలేదు. లేటెస్టుగా మరోసారి పెట్టుకున్న పిటీషన్నూ కొట్టేసింది.సో.. రేవంత్ కాళ్లకు సంకెళ్లు కంటిన్యూ అవుతున్నాయన్నమాట. 



మరింత సమాచారం తెలుసుకోండి: