భారతదేశం ఇన్నాళ్లకు ఒక నిర్ణయం తీసుకుంది. దేశంలో పోర్న్‌ వెబ్‌సైట్లు ఓపెన్‌ కాకుండా చేశారు. ఎయిర్‌టెల్‌ ఎంటీఎస్‌ వంటి కొన్ని సంస్థలు, ఆపరేటర్లు అందిస్తున్న ఇంటర్నెట్‌ సర్వీసుల్లో తప్ప దేశవ్యాప్తంగా ఉన్న పలు లీడింగ్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల సేవల్లో బూతు వెబ్‌సైట్లు ఓపెన్‌ కావడం లేదు. వీటిని అధికారుల సూచనల మేరకు నిషేధించినట్లుగా ఒక మెసేజీ వస్తోంది. పోర్న్‌ వెబ్‌సైట్లను ఇలా కట్టడి చేయడంపై దేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. శోచనీయమైన విషయం ఏంటంటే.. అధికారికంగా తామే వీటిని నిషేధించినట్లుగా ఇప్పటిదాకా ప్రభుత్వం ప్రకటించలేదు. అందుకు వారికి ధైర్యం చాలలేదా అనిపిస్తోంది. 


పోర్న్‌ వెబ్‌సైట్లను కట్టడి చేయడం గురించి ఈ దేశంలో చాలాకాలంగా ఒక వర్గం పోరాటం చేస్తూనే ఉంది. యువతను, కొన్ని సందర్భాల్లో వయో పరిమితులతో నిమిత్తం లేకుండా చాలా మందిని ఈ వెబబ్‌సైట్లు పెడతోవ పట్టిస్తున్నాయనే ఆరోపణలు బాగా ఉన్నాయి. పైగా చాలా దేశాల్లో.. అసలు తొలినుంచి ఇంటర్నెట్‌లో పోర్న్‌ వెబ్‌సైట్‌లను అనుమతించడమే లేదనే సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇన్నాళ్లకు ఈ దేశంలో నిషేధం విధించారు గానీ.. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించడానికి ప్రభుత్వాలకు ధైర్యం చాలుతున్నట్లు లేదు. 


కాగా, ఈ వెబ్‌ బూతు నిషేధం మీద నానా రకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాంగోపాల్‌ వర్మ లాంటి అతివాదులు అనేక మంది.. తమ తమ ట్విటర్‌ ఖాతాల్లో.. చాలా చురుగ్గా దీనిని ఖండిస్తున్నారు. సహజంగా ఇది పోర్న్‌కు సంబంధించి ఆసక్తికరమైన అంశం కావడంతో.. నిషేధాన్ని విమర్శించే వాళ్ల వ్యాఖ్యలకు మీడియాలో విపరీతంగా ప్రచారం దక్కుతోంది. మరి ప్రభుత్వం మీనమేషాలు లెక్కించకుండా.. అధికారిక నిషేధమే ఇది అని ప్రకటించి, ఈ విషయంలో భిన్నాభిప్రాయాలకు చోటు లేదని తేల్చేస్తే.. కనీసం వారి నోళ్లకు తాళాలు పడతాయని ఆశించవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: