తెలంగాణపై ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.  ప్రపంచ వ్యాప్తంగా తాలిబన్ తీవ్రవాదులు, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోడానికి భవనాలు కూలుస్తుంటే టీఆర్ఎస్ ఇక్కడి భవనాలు కూలగొడుతున్నాయి. టిఆర్ఎస్ ను ఆయన తాలిబన్ తో పోల్చుతున్నారు. తాలిబన్ ఆఫ్ తెలంగాణ గా టిఆర్ఎస్ వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.

శిధిలమైతే చార్మినార్ ను కూడా కూల్చవలసి వస్తుందని ఉప ముఖ్యమంత్రి మహమూబ్ ఆలీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఈ విమర్శలు గుప్పించారు. పూర్వం ఔరంగజేబు గోల్కొండ కోటపై దాడిచేసి అనేక భవనాలను కూల్చాడని, చార్మినార్‌ను మాత్రం వదిలిపెట్టాడని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం దాన్ని కూడా వదిలిపెట్టకుండా కూల్చేస్తామని ఉప ముఖ్యమంత్రి అంటుండడం దారుణమన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి కెసిఆర్ ను సంతోషపరచడానికేనని ఆయన వ్యాఖ్యానించారు.    ప్రపంచ దేశాల్లో పురాతన కట్టడాలను భావితరాలకు అందించాలనే ఆలోచనతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వాటిని బాగు చేయిస్తుంటే తెలంగాణ సర్కార్‌ మాత్రం వాటిని కూలదోసే పనిలో పడిందని విమర్శించారు.  

టీఆర్ఎస్ పార్టీ


చారిత్రక చిహ్నాలను ధ్వంసం చేసే ఎజెండాతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ తాలిబన్‌లా వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ శాసనమండలి పక్ష నేత షబ్బీర్‌ అలీ ధ్వజమెత్తారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయం, చెస్ట్, ఉస్మానియా ఆసుపత్రుల భవనాలను కూలుస్తున్నారని షబ్బీర్ తీవ్రంగా విమర్శించారు. ఈ క్రమంలో ఆ పార్టీకి కొత్త నిర్వచనం చెప్పారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదని, 'తాలిబన్ ఆఫ్ తెలంగాణ' అని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ అచ్చం అలాగే వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: