దేశం కోసం, స‌మాజం కోసం, ప్ర‌జా శ్రేయ‌స్సు కోసం స‌ర్వ‌స్వం త్యాగం చేసిన వారినే మ‌హాత్ముడు అంటారు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాల‌ని బ‌డిపంతులు విద్యార్ధుల‌కు బోదిస్తూ ఉంటారు. దీనికోసం వారి జీవిత చ‌రిత్ర‌ల‌ను పాఠ్య‌పుస్త‌కాల్లో చేర్చటం వ‌ల్ల వారి చ‌రిత్ర‌, చిత్ర‌ప‌టాలు భావిత‌రాల‌కు , ముఖ్యంగా పిల్ల‌ల‌కు స్పూర్తి క‌లిగిస్తాయి. ఇందుకు గానూ మ‌హాత్ముని న‌డిచిన బాట‌లు, వారిచేప‌ట్టిన ప్ర‌జాప్ర‌యోజ‌న కార్య‌క్ర‌మాల‌ను పాఠ్యాంశాల‌లో చేర్చుతారు. కానీ రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం ఇవేమీ గ‌మ‌నించ‌కుండా అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న ఆశారాం ను మ‌హాత్ముడ‌ని, ఆయ‌న గుర్తించ‌వ‌ల‌సిందిగా ఆ రాష్ట్ర మూడ‌వ త‌ర‌గ‌తి పుస్తకంలో ఆయ‌న చిత్ర ప‌టాన్ని ముద్రించారు. అయితే ఆ పాఠ్యాంశంలో ఉన్న ఇత‌ర మ‌హాత్ముల‌ను పిల్ల‌లు గుర్తించారు. కానీ ఆశారాం చిత్ర ప‌టం ద‌గ్గ‌ర వారు ఆగిపోయారు.

వివేకానంద‌


శంకరా చార్య‌, మ‌ద‌ర్ థెరిసా, వివేకానంద‌, గురునాన‌క్, రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస‌, సంత్ క‌బీర్, రాందేవ్ బాబా, ఆసారాం బాపు ఉపాధ్యాయుడు చెబుతున్న విష‌యాల‌ను వ‌ల్లే వేస్తూ వ‌చ్చిన పిల్ల‌లంద‌రూ చివ‌రి పేరు వ‌ద్ద ఠ‌క్కున ఆగిపోయారు. త‌మ లాంటి ఓ చిన్నారిని చిదిమేసే ప్ర‌య‌త్నం చేసి, ప్ర‌స్తుతం జైలు లో ఉన్న ఆసారాం మ‌హాత్ముడు ఎలా అవుతాడో అ చిన్ని బుర్రలు ఆలోచించ‌డం మొద‌లు పెట్టాయి. కానీ పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు,వాటిని ముద్రించిన ప‌బ్లిష‌ర్ ల‌కు మాత్రం ఆ సందేహం ఇస‌మంతైనా క‌ల‌గ‌లేదు. ప్ర‌స్తుతం రాజ‌స్థాన్ లోని కొన్ని జిల్లాల పాఠ‌శాల‌ల్లో నెల‌కొన్న వాస్త‌వ ప‌రిస్థితి ఇది. 16 ఏళ్ల బాలిక‌ను అత్యాచారం చేశాడ‌న్న ఆరోప‌ణల పై అరెస్ట‌యిన ఆసారాం బాబు ను మ‌హాత్ముడి గా అభివ‌ర్ణిస్తూ ఆయ‌న చిత్ర ప‌టాన్ని గుర్తించాల్సిందిగా మూడో త‌ర‌గతి జీకే పుస్తకంలో చేర్చిన పాఠ్యాంశం పై స‌ర్వత్రా ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌హాన్న‌తుల జాబితాలో అత్యాచారం కేసులో నిందితుడ్ని ఎలా చేర్చుతారంటూ ప్ర‌శ్న‌లు  ఉత్ప‌న్న మవుతున్నాయి. 


అయితే ఇలాంటి పాఠ్యాంశం ఒక‌టుంద‌ని త‌మ‌కు ఇంకా తెలియ‌రాలేద‌ని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇది ఇలా ఉండ‌గా ఆసారాం ను పాఠ్యాంశంలో చేర్చే నాటికి ఆయ‌న‌పై ఎలాంటి కేసులు లేవు. పుస్త‌కం అచ్చ‌యి విద్యార్దుల‌కు చేరిన తరువాత ఆయ‌న అరెస్ట‌య్యారు. వెంట‌నే ఆ పుస్త‌కాల‌న్నీ వెన‌క్కి తెప్పించాం. కొత్త‌వాటిని ముద్రించే ప‌నిలో ఉన్నామ‌ని ప‌బ్లిష‌ర్ లు వివ‌ర‌ణ ఇస్తున్నారు. అయ‌తే ప‌బ్లిష‌ర్ ప్ర‌క‌ట‌న న‌మ్మ‌ద‌గిన‌దిగా లేవని మేదావులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. జ‌రుగుతున్న ప‌రిణామాలు ప్ర‌పంచమంతా క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా క‌న‌బ‌డుతున్న ప‌బ్లిష‌ర్ ల‌కు చెవుమీద పేను పారిన‌ట్టుగా లేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతున్నాయి.   

 ఆశ్ర‌మానికి వ‌చ్చే 16 ఏళ్ల అమ్మాయిలు చాలా మంది


వేందాతాలు వళ్లిస్తాన‌ని ఆశ్ర‌మం ముసుగులో ఆశారాం బాబు చేసిన ఆకృత్యాలు ఇన్ని అన్ని కావు.  ఆశ్ర‌మానికి వ‌చ్చే 16 ఏళ్ల అమ్మాయిలు చాలా మంది ఆశారాం కోరిక‌ల‌కు బ‌లైన‌వారేన‌ని శిష్యులు అంటున్నారు. అంతేకాకుండా ఒకే సారి తల్లీ కూతుళ్ల‌తో కూడా ఆశారాం ర‌తి క్రీడ ఆడిన‌ట్లు శిష్యులు భ‌యం భ‌యంగా భ‌యంక‌ర‌మైన నిజాలు బ‌య‌ట‌పెడుతున్నారు. ఇది ఇలా ఉండ‌గా ఆయ‌న గురించి ఆయ‌న శిష్యులు న‌మ్మ‌లేని నిజాలు బ‌య‌ట‌పెట్టారు. ఆశారాం ప‌డ‌క గ‌ది లో అనేక శృంగార భంగిమ‌ల‌ను, అమ్మాయిల‌పై ప్ర‌యోగించి, ర‌తిక్రీడ సాగిస్తాడ‌ని ఆయ‌న వ్య‌క్తి గ‌త శిష్యుడు శివ పోలీసుల ముందు నివ్వెర‌పోయే నిజాల‌ను బ‌య‌ట‌పెట్టారు. ఆశారం వ్య‌క్తిగ‌త డాక్ట‌ర్లు సైతం కళ్లుతిరిగిపోయే నిజాల‌ను బ‌య‌ట‌పెట్టారు. ఆశారాం కామ‌కోరిక‌ల‌కు ఎంత‌మంది బ‌లైయ్యార‌ని వారు తెలిపారు.

మైన‌ర్ బాలిక‌పై లైంగిక దాడికి పాల్ప‌డిన కేసులో


కాగా 16 ఏళ్ల మైన‌ర్ బాలిక‌పై లైంగిక దాడికి పాల్ప‌డిన కేసులో  2013 సంవ‌త్స‌రం ఆగష్టు లోనే ఆశారాం బాపు జైలు కు వెళ్లారు. నాటి నుంచి కోర్టు ఆయ‌న బెయిల్ ను తిర‌స్క‌రిస్తూ వ‌స్తున్నారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆశారాం జైలు లోనే ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న కేసుల్లోని సాక్షుల‌ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కాల్పులు జ‌రుపుతూ వ‌స్తున్నారు. ఈ కేసులో అత్యంత కీలక సాక్షి గా ఉన్న కిపాల్ సింగ్ తో స‌హా స‌మారుగా 9 మంది పై కాల్పులు జ‌రిపారు ఇందులో ఏడుగురు మ‌ర‌ణించగా మ‌రో ఇద్ద‌రు తీవ్ర గాయ‌ల‌పాల‌య్యారు. ఇప్ప‌టికీ ఈ కేసులో ఏలాంటి పురోగ‌తి లేదు. గ‌తం లో ఆశారాం బాబు అక్క‌డి ప్ర‌భుత్వాలు మ‌ద్ద‌తునిస్తున్నాయన్న వాద‌న‌లు గ‌ట్టిగా వినిపించాయి.  


దేశంలో ఇలాంటి ఆరోప‌ణ‌లు ఎదురుకుంటున్న వారి చ‌రిత్ర లు కూడా చ‌రిత్ర పాఠ్యాంశాల‌లో చేర్చి పిల్ల‌ల‌కు పాఠాలు చేప్పించాలా?  వీరి జీవిత చ‌రిత్ర చదివి పిల్ల‌లు బాగుప‌డుతారా? ఇలాంటి వారి చ‌రిత్ర లు వింటేనే అస‌హ్యం వేస్తుంది. అలాంటిది పాఠ్యాంశాల‌లో చ‌ద‌వ‌డం ఏంట‌నీ తీవ్ర నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. భావిభారత పౌరులకు బోధిస్తున్న పాఠ్యాంశాల్లో ఇలాంటివి ఇంకెన్ని విషయాలు వెల్లడవుతాయో వేచి చూడాలి..!


మరింత సమాచారం తెలుసుకోండి: