తి ఒక్కరి హృదయం మరియు దాని పని తీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటారు, కానీ, ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించటంలో విఫలం అవుతున్నారు. గుండెను ఆరోగ్యంగా నిర్వహించటమే కాకుండా, గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. దీని కోసం గానూ చాలా రకాల విధులను నిర్వహించాలి. ఈ విధులను రోజు నిర్వహిస్తూ, మీ జీవన శైలిలో వీటిని ఒక అంశాలుగా మార్చుకోవాలి.


గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. సాధారణ శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానాన్ని అనుసరించి గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. భోజన సమయాలను ఖచ్చితంగా పాటించాలి. నలభై ఏళ్ల వయస్సు దాటిన తరువాత క్రమం తప్పకుండా ఏడాదికి ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉండటం అవసరం. పండ్లు తీసుకోవాలి. ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. జంక్‌ ఫుడ్‌ను త్యజించాలి.

ఆరోగ్యమైన గుండె కోసం..


పలు రుగ్మతలకు, గుండె జబ్బులకు కారణమైన వాటిలో ప్రధానమైనది మానసిక ఒత్తిడి. మానసిక ఒత్తిడిని నివారించుకోవడానికి చర్యలు చేపట్టాలి. సమస్యలు ఎదురైనప్పుడు వాటి పరిష్కారానికి తగిన నిర్ణయాలు తీసుకోవాలి.ఊబకాయం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరిగి అధిక రక్తపోటుకు దారితీస్తుంది దీనితో గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయి. శరీర బరువును సరిగ్గా ఉంచుకోవడం కూడా పాటించాల్సిన నియమాల్లో ఒకటి.  


గుండె జబ్జు నివారంచడానికి కొన్ని చిట్కాలు.!! 

జీవించేందుకు తినండి, తినడం కోసం బ్రతకకండి. మీ శారీరక బరువును నియంత్రించండి.

ఎక్కువగా వేయించిన వేపుడు పదార్థాలను తినకండి

వాతావరణాన్ననుసరించి లభించే పండ్లను ఆహారంగా తీసుకుంటుండండి

పొట్టు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోండి. ఉదాహరణకు పొట్టు కలిగిన పప్పుదినుసులు, యాపిల్ పండు, పచ్చి జామకాయ, దానిమ్మపండు మొదలైనవి తీసుకోవాలి.

ఉప్పును తక్కువ మోతాదులో తీసుకోండి.

పొగాకు, మద్యం, ధూమపానం సేవించకండి.

ప్రతి రోజు 15-20 నిమిషాలపాటు వ్యాయామం చేయండి.


మరింత సమాచారం తెలుసుకోండి: