ఇసుక మాఫియా దాడిలో డాయాల పాలైన ముసునూరు తహసీల్దార్‌ వనజాక్షికి బెదిరింపు లేఖ వచ్చింది. ముసునూరు నుంచి బదిలీ చేయించుకొని వెళ్లకపోతే చంపేస్తామంటూ గుర్తుతెలియని దుండగుడు లేఖ రాశారు. ఈ లేఖ ఆకాశరామన్న పేరుపై వచ్చింది.  అక్రమ ఇసుక రవాణా వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌కు ఆమెకు మధ్య పెద్ద గొడవ జరిగిన విషయం తెల్సిందే. కుటుంబాన్ని మాత్రం ఏమీ చేయబోమని దుండుగులు లేఖలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు వనజాక్షిపై దాడి చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ దాడిని నిరసిస్తూ కృష్ణా జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు కూడా దిగారు. దీంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి సమస్యను పరిష్కరించారు. ఈ లేఖ అటు రెవెన్యూ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ కలకలం రేపుతోంది. పైగా ఆమెన హతమార్చేందుకు ఇప్పటికే రెండు సార్లు రెక్కీ నిర్వహించినట్లు లేఖలో తెలిపారు. దీంతో అప్రమత్తమైన తహశీల్దార్‌ వనజాక్షి ముసునూరు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కాగా వనజాక్షి పైన దాడికి పాల్పడిన చింతమనేని ప్రభాకర్ అనుచరుల పైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనికి ఓ కమిటీ వేస్తామని చెప్పారు.

అధికారులతో మాట్లాడుతున్న వనజాక్షి


ఈ నేపథ్యంలో శర్మను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణాధికారిగా నియమించింది. ఎమ్మార్వో వనజాక్షి కేసులో ప్రస్తుతం విచారణ సాగుతోంది.ఈ లేఖలో ఎమ్మార్వో వనజాక్షి మీడియాతో మాట్లాడారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని తెల్చి చెప్పారు. ముసునూరుని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. నాకు, నా కుటుంబానికి ప్రభుత్వమే రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులకే రక్షణ లేకంటే ఎలా అని ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: