బూతు వెబ్ సైట్లపై నిషేధం విధించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనను సంచలన దర్శకుడు వర్మ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఇప్పటివరకూ ట్వీట్ల ద్వారా తన అభిప్రాయాలు వెల్లడించారు. తీవ్రంగా నిరసన తెలిపారు.ఐతే ఆ డోస్ సరిపోదనుకున్నారో ఏమో.. ఈసారి ఏకంగా ఓ వ్యాసమే రాశారు. ఆంధ్రజ్యోతి పత్రిక ఆ సంచలన వ్యాసాన్ని ప్రచురించింది. 

బూతు వెబ్ సైట్లను నిషేధించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండకపోగా..అది మరింత అనర్థాలకు దారి తీస్తుందని వర్మ తన వ్యాసంలో అభిప్రాయపడ్డారు. పిల్లలు బూతు సినిమాలు చూస్తే తప్పేంటని ఆయన వాదించారు. ఈ విషయమై అంత కలవరపాటు ఎందుకో నాకు అర్థం కావడం లేదు.. నిజమేమిటంటే లైంగిక చైతన్య దశకు రాని పిల్లలకు ఆ బూతు సినిమాలు అటువంటి స్పందనలేవీ కలిగించవు. ఇక వయస్సుకు వచ్చిన పిల్లలకు ఎలాగూ ప్రకృతి అన్నీ నేర్పుతుంది కదా. వారికి బూతు చిత్రాల అవసరమేమీ ఉండదు.. ఇలా సాగింది వర్మగారి వ్యాసం. 

యాక్షన్‌ సినిమాలను చూసే స్త్రీలు తమ భర్తలు లేదా బాయ్‌ ఫ్రెండ్స్‌ కూడా తెరపై హీరో మాదిరిగా కఠినంగా వ్యవహరించాలని కోరుకుంటున్నారా అని వర్మ తన వ్యాసంలో ప్రశ్నించారు. అశ్లీల సాహిత్యం గానీ, బూతు సినిమాలు గానీ సహజసిద్ధమైన లైంగిక వాంఛకు ఒక ఉద్దీపన మాత్రమేనని... ఆకలిని తీర్చుకోవడానికి రుచివంతమైన ఆహార పదార్థాలను ఎలా తయారుచేసుకుంటామో లైంగిక ఆరాటాలను సంతృప్తిపరచుకొనే విషయంలో బూతు సినిమాలను చూడడం కూడా అంతేనని కామెంట్ చేశారు. 

లైంగిక వాంఛలను తృప్తిపరచుకోవడమనేది జీవితపు మౌలిక ప్రేరణలలో ఒకటి. లైంగిక విషయాలకు సంబంధించిన నిర్ణయాలు మనం స్వేచ్ఛగా తీసుకోవల్సిన నిర్ణయాలని వర్మ అభిప్రాయపడ్డారు. పోర్న్‌ ఒక ఉద్దీపన, ఒక స్వైర కల్పన. అంతే. వాటి కోసమే పోర్న్‌ను వీక్షించాలి. వీక్షకుల మెదళ్లపై పోర్న్‌ నెరపే ప్రభావం టెలివిజన్‌, వీడియో గేమ్స్‌ నెరపే ప్రభావాల కంటే భిన్నమైనదనడానికి ఎటువంటి శాస్త్రీయ రుజువులు లేవని వర్మ వాదించారు. అశ్లీల చిత్రాలు లైంగిక నేరాలను పెంచవనేది ఒక నిరూపిత సత్యమని వర్మ కామెంట్ చేశారు. అంతే కాదు.. అతిగా సెక్స్ చేయడం వల్ల ఎవరూ చనిపోయేంత ప్రమాదం కూడా ఏమీలేదని సమర్థించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: