తెలుగు రాష్ట్రాలు రెండు గా విడిపోయిన తర్వాత హై కోర్టు విషయంలో రగడ మొదలైంది. ఈ రోజు పార్లమెంట్ లో ఎప్పటి నుంచో ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ రోజు లోక్ సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ మాట్లాడుతూ ప్రస్తుతము హైదరాబాద్ లో వున్న హైకోర్టు తెలంగాణకే చెందుతుందని స్పష్టం చేశారు. పునర్విభజన చట్టం ప్రకారం ఏపీలో హైకోర్టు నెలకొల్పడానికి ఆ ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించాలన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటుకు స్థలాన్ని అన్వేషిస్తున్నామని కేంద్రన్యాయశాఖ మంత్రి సదానందగౌడ్‌ తెలిపారు. బుధవారం లోక్‌సభలో ఉమ్మడి హైకోర్టు విభజనపై సదానందగౌడ ప్రకటన చేశారు. ఏపీకి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉందన్నారు. ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు అయ్యేవరకు హైదరాబాద్‌లోని ఉమ్మడి హైకోర్టు ఇరురాష్ర్టాలకోసం పనిచేస్తుందని తెలిపారు.ప్రస్తుతం ఉన్న హైకోర్టు తెలంగాణ రాష్ట్రానికే చెందుతుందని, ఏపీకి కొత్త హైకోర్టును త్వరలో ఏర్పాటు చేస్తామని, ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశామని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ బుధవారం లోకసభలో చెప్పారు.

హైకోర్టు తెలంగాణకు కేటాయించాలని నిరసన తెలుపుతున్న తెలంగాణ నాయకులు (ఫైల్)


హైకోర్టు విభజన పైన కవిత చేసిన వ్యాఖ్యలపై వెంకయ్య ఆగ్రహించారు. హైకోర్టు విభజన అంశం లోకసభలో చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా సదానంద గౌడ మాట్లాడారు. ఇప్పుడున్న హైకోర్టు తెలంగాణ రాష్ట్రానిదేనన్నారు.  ఏపీ కోరుకున్న చోట కొత్త హైకోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. ఎంత త్వరగా చెబితే అంత త్వరగా హైకోర్టు ఏర్పాటు ఉంటుందన్నారు. ఏపీ హైకోర్టు స్థలానికి అన్వేషణ చేయవలసి ఉందని చెప్పారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నింటికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: