ప్రపంచ దేశాల్లో క్రికెట్ అంటే తెలియని వారు ఉండరు... క్రికెట్ అభిమానించే వారు సచిన్ అంటే తెలియని వారు ఉండరు. భారత దేశంలో ఒక నానుడి ఉంది.. క్రికెట్ ఒక దేవాలయం అయితే అందులో దేవుడు సచిన్ టెండుల్కర్ అంటారు. చిన్న నాటి నుంచి క్రికెట్ అంటే అభిమానం పెంచుకొని క్రికెట్ మైదానంలో అడుగు పెట్టిన సచిన్ ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన భారతీయ ఆటగాడు సచిన్ రమేష్ టెండుల్కర్.

2002 లో విజ్డెన్ పత్రిక టెస్ట్ క్రికెట్ లో ఆస్ట్రేలియా కు చెందిన డాన్ బ్రాడ్‌మెన్ మరియు వన్డే క్రికెట్ లో వెస్ట్‌ఇండీస్ కు చెందిన వివియన్ రిచర్డ్స్ ల తర్వాత క్రికెట్ క్రీడా ప్రపంచంలోనే సచిన్ ను రెండో అత్యున్నత బ్యాట్స్‌మెన్ గా ప్రకటించింది. తాజాగా కెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మంగళవారం హైదరాబాద్‌లో సందడి చేశారు. మాదాపూర్‌లోని ఇనార్బిట్‌ మాల్‌లో ఆన్‌లైన్ గేమింగ్ సంస్థ స్మాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ పార్క్‌ను సచిన్ ప్రారంభించారు.

సచిన్ సెల్ఫీ ఫోటో తీస్తూ ఇలా..

ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ..   హైదరాబాద్ అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పారు.  హైదరాబాద్ వచ్చినపుడల్లా హైదరాబాద్ బిర్యానీ తింటుంటానని, అంబటి రాయుడు తో అడిగి మరీ బిర్యానీ తెప్పించుకుంటామని మాస్టర్ చెప్పారు.. జైపూర్ పింక్‌ పాంతర్స్, తెలుగు టైటాన్స్‌ మధ్య జరిగే మ్యాచ్‌ను సచిన్ టెండూల్కర్ వీక్షించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: