లష్కర్ (ఉజ్జయిని మహంకాళి) బోనాలు ఉత్సవాల్లో ఆదివారం ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి, జాతీయ విపత్తు నివారణ సంస్థ ఉపాధ్యక్షులు మర్రి శశిధర్ రెడ్డి, సికిందరాబాద్ ఎంపి అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే జయసుధ, మాజీ మంత్రి శంకర్ రావు, తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, పలువురు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఉత్సవాలను పురష్కరించుని ముఖ్యమంత్రి, ఉజ్యయిని అమ్మవారికి పట్టు వస్త్రాలను బహుకరించారు. ఈ సందర్భంగా దేవాదాయ మంత్రి మాట్లాడుతూ బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. లష్కర్ బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించాలని మాజీ మంత్రి శంకర్ రావు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శంకర్రావు సహ తెలంగాణ జేఏసీ నాయకులు జై తెంలంగాణ నినాదాలు చేశారు. విఐపీల దర్శనాన్ని పురష్కరించుకుని పోలీసు యంత్రాంగం బందోబస్తు ఏర్పాట్లు చేసింది. బిజెపి అధ్య.క్షులు బి.కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఉజ్జయిని అమ్మవారి ఆలయాన్ని చేరుకున్నారు. సోమవారం నాడు అమ్మవారి భక్తులు భవిష్యత్తు(రంగం)ని వినిపిస్తారు. ఉత్సవాల సందర్భంగా సికిందరాబాద్ ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: