తెలుగు రాష్ట్రాలో పెను సంచలనం రేపిన ఓటుకు నోటు వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతూ వస్తుంది. ఇరు రాష్ట్రాల్లో రాజకీయంగా ఒక్క కుదుపు కుదిపిన ఈ కేసు సర్వత్రా ఉత్కంఠాన్ని రేకెత్తిస్తుంది. కాగా ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న  టీ-టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటయ్యలు బెయిలు పై విడుదల అయ్యారు. ఎమ్మెల్యేలు రేవంత్‌ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య స్వర నమూనాలను అసెంబ్లీ సిబ్బంది ఏసీబీ కోర్టుకు సమర్పించారు. స్వర పరీక్షల నిమిత్తం అసెంబ్లీలో వారు మాట్లాడిన టేపుల్ని అందించాల్సిందిగా కోర్టు గతంలో ఆదేశించింది.గురువారం ఈ టేపులను సమర్పించారు. వీటిని ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్‌)కు పంపాల్సిందిగా కోరుతూ దర్యాప్తు అధికారులు కోర్టులో మెమో దాఖలు చేశారు.  ‘ఓటుకు కోట్లు’ కేసులో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.

 ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితోపాటు మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలకు ఉచ్చు బిగుసుకుంటోంది.నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇస్తూ రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం విదితమే. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసిబి దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో ప్రమేయముందని పలువురిని విచారించిన ఏసిబి అధికారులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో పాటు ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను కూడా అరెస్ట్ చేయగా, కోర్టు నుంచి వీరు బెయిలు పొందిన సంగతి తెలిసిందే.

ఓటుకు నోటు వ్యవహారం ముఖ్య సాక్ష్యంగా స్టిఫెన్ సన్ తో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి


టేపులన్నీ నిజమైనవేనని నిర్ధారించినందున వారికి స్వర నమూనా పరీక్షలు నిర్వహించాలని గతంలో ఏసీబీ అధికారులు కోర్టుకు విన్నవించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య స్వర నమూనాలను అసెంబ్లీ అధికారులు గురువారం ఏసీబీ కోర్టుకు సమర్పించారు. వారిరువురితో పాటు సెబాస్టియన్, ఉదయసింహ మీడియాతో మాట్లాడిన టేపులను సైతం ఎఫ్‌ఎస్‌ఎల్ విశ్లేషణకు అందజేయాలంటూ ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: