టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన టీడీపిని వదిలిపెట్టి వెళ్లే ముచ్చేటే లేదు.. నన్ను ఇంత పరాభవం చేసిన కేసీఆర్ ని వదిలే ప్రసక్తే లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి  ఓటుకు నోటు కేసులో ఏ1గా ఉన్న ఉన్న విషయం తెలిసిందే.. ఈకేసులో ఇతర నిందితులు ఉదయ్ సిన్హా, సెబాస్టియన్‌లు ఈ రోజు ఏసీబీ న్యాయస్థానానికి హాజరయ్యారు. తెలంగాణలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా టీటీడీపిలో కొనసాగుతూ అధికార పక్షాన్ని ఎండగడుతూ వస్తున్నాడు. శాసన సభలో ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా టీడీపీ తరుపున రేవంత్ రెడ్డి తన గళం వినిపిస్తాడు.

తెలంగాణలో మహానాడు అయిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టిఫెన్ సన్ తో 50 లక్షలతో ఓటుకు నోటు వ్యవహారంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టు పడ్డాడు.  ఈ సంఘటన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఇరు రాష్ట్ర నేతలు నువ్వా అంటే నువ్వా అని తీవ్ర విమర్షలకు దిగారు. ఇక ఈ సందర్భంలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. అంతే కాకుండ సెక్షన్ 8 కూడా తెరపైకి వచ్చింది. శుక్రవారం ఈ కేసు విషయంలో రేవంత్ రెడ్డి,సండ్ర   ఏసీబీ న్యాయస్థానానికి హాజరయ్యారు. విచారణలో భాగంగా వారు న్యాయస్థానానికి వచ్చారు.

 స్టిఫెన్ సన్ తో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి


ఈ కేసుకు సంబంధించి సప్లిమెంటరీ సమన్లను ఎసిబి అధికారులు కోర్టులో దాఖలు చేశారు. ఏసిబి ఛార్జీషీటును పరిగణలోకి తీసుకున్న తర్వాత సమన్లు పంపించనున్నట్లు తెలిపింది.ఈ నేపథ్యంలో సమన్లు జారీ అయితే మరోసారి ఎసిబి ఎదుట రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశముంది.  కోర్టుకు హాజరైన అనంతరం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో టీడిపి పుంజుకుంటుందని ఆ అక్కసుతోనే కేసీఆర్ చీప్ ట్రిక్స్ కు పాల్పడ్డారని  ప్రభుత్వం కుట్రపూరితంగానే తనను ఇరికించిందని ఆరోపించారు. మరో ఇరవై అయిదేళ్ల పాటు తాను కొడంగల్ నుంచి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: