1.అయ్యా ప్రశ్నిస్తానని పార్టీ పెట్టి ఇప్పటిదాకా ప్రశ్నించింది ఎంతమందిని?

2. తమరు మద్దతిచ్చిన "నమో నారా"యణులు ఏం (ప్రజల కోసం) సాధించారని మీరు అనుకుంటున్నారు?

3. వోటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు గారికి మీరింకా మద్దతిస్తున్నారంటే, మీరుకూడా దానిని సమర్థించినట్టేనా?

4. పుష్కరాలలో 29 మంది మరణిస్తే ప్రశ్నించకుండా మీరెక్కడున్నారు?

5. రాజధాని శంకుస్థాపనకు మీకు ఆహ్వానం రాలేదా? మీరే వెళ్ళలేదా? 

6. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగస్తులు ఇంకా హైదరాబాదుని పట్టుకుని వేళ్ళాడుతూ పరిపాలన పరాయి ప్రదేశమునుండి చేస్తామంటే వారిని ఎందుకు ప్రశ్నించడం లేదు?

7. భూములు లాక్కొనే చట్టాలు జరిగిపోతుంటే మీరెక్కడున్నారు? మోదీ గారితో ఫోటోతోనే సంతృప్తి చెందారా?

8. రాజధానికి వేలకొద్దీ ఎకరాలు (3 పంటలు పండే) నేల ఎందుకని ప్రశ్నిస్తే మిమ్మల్ని పట్టించుకున్నవారేరి? పట్టించుకోని వారిమీద మీరు తీసుకోబోయే చర్య ఏమిటి?

9. పార్టీ పెట్టడం తప్ప కార్యవర్గం గానీ, కార్యాచరణగానీ లేని పార్టిని ప్రజలు ఎలా నమ్మాలి?

10. బాబొస్తే జాబొస్తుందకున్న సామాన్యుడికి మీ సమాధానమేమిటి?

11. రాజధానికి ప్లానుకూడా గీసేపాటి సత్తాకూడా మన ఇంజనీర్లకు లేదని మీరు భావిస్తున్నారా?

12. నారాయణగారి కాలేజీలలో పిట్టల్లా రాలిపోతున్న పిల్లగురించి ఏమైనా ప్రశ్నించారా? అసలు విద్యా వ్యవస్థ గురించి మీకున్న అభిప్రాయాలేమిటి?

13. నాగార్జున యూనివర్సిటీలో ప్రిన్సిపల్ అకృత్యాలకు ఒక ఒక అమ్మాయి ప్రాణం బలైన సంధర్భంలో మీరు ఎవరినైన ప్రశ్నిచారా?

14. TDP ఎమ్మెల్యేలు ఆ మధ్య గవర్నర్ గారిమీద దుమ్మెత్తిపోసినప్పుడు మీరేం చేస్తున్నారు? గవర్నర్ గారు పక్షపాతి అని మీరుకూడా నమ్ముతున్నారా? 

15. మోదీగారి పక్కన హోదా సాధించిన మీరు ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేకపోతున్నారు? మోదీ మిమ్మల్ని కూరలో కరివేపాకులా వాడుకున్నట్టు మీకేమైనా అనిపిస్తోందా?

16. సినిమాలలో హీరో పక్కన ఉండే వారిని పదే పదే చెంప చెళ్ళుమనిపించడం మీద మీ అభిప్రాయం ఏమిటి? సాటి మనిషికి (ముఖ్యంగా స్నేహితులకు) మన హీరోలు ఇచ్చే గౌరవం ఇదేనా?

17. మొహంలో భావాలేమీ పలుకకున్నా (పెద్దల అండతో) సినీమాలను నాశనం చేస్తున్న ప్రస్తుత యువ నటులపైన మీ అభిప్రాయం ఏమిటి?

18. తమ పుతృలను సినీ రంగంలో ప్రవేశపెడుతున్న పెద్దలు తమ కూతుళ్ళను కూడా అలాగే గెంతించాలని (పాటలలో) అభిమానులు కోరటం ఏమైనా తప్పా?

19. అభివృద్దిలో భాగంగా కొందరు త్యాగాలు చేయాల్సి ఉంటుందన్న మీమాట అక్షర సత్యం. కానీ అది బలవంతమైతే మీరు ఎలా ఎదుర్కొంటారు? మీకున్న శక్తులేమిటి?

20. (అమ్ముడుపోయారనుకుంటున్న) "చిరు" దెబ్బనుంచి తేరుకోని అభిమానులు మిమ్మల్ని నమ్మేదెలా? మీరుకూడా అలా చేయరన్న నమ్మకం ఏమిటి?

21. మీ పవన్"ఇజం" అభిమానులను దాటి సామాన్యుడిని చేరుతుందా?

ఇంకా చాలా అడగాలనుకున్నా .... కానీ మీ అభిమానిని కాబట్టి మీలాగే సంధర్భంవచ్చినప్పుడు అడుగుతా...

మీ నిష్టూరాభిమాని
గమనిక: ఇంకా ఎవరైనా అభిమానులు ప్రశ్నించాలనుకుంటే కామెంట్స్లో ప్రశ్నించవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: