ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు మన పెద్దలు. పాత రోజుల్లో కేవలం ఇంట్లో వండిన ఆహార పదార్థాలను మాత్రమే ఆరగించేవారు. కానీ, ప్రస్తుతం పరిస్థితి పూర్తి విరుద్ధం. రోడ్ల మీద, మురికికాల్వల పక్కన, బాగా మరగకాచిన నూనెతో వండిన పదార్థాలను తిని రోగాల బారినపడుతున్నారు. పిల్లలు ఇష్టపడతారని స్నాక్స్ పేరుతో నూడిల్స్, పానీపూరి, బేకరీ ఐటమ్స్ వంటిని అందిస్తుంటాం. అయితే, ఇవి ఆరోగించే సమయంలో నోటికి ఎంతో రుచికరంగా ఉన్నప్పటికీ… ఆ తర్వాత అనేక అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటాం. జంక్‌ఫుడ్స్ తినడం వల్ల ఒబెసిటీ, దీర్ఘకాలిక వ్యాధులొస్తాయని వైద్యుల హెచ్చరిస్తున్నారు.


అంతేగాకుండా జంక్ ఫుడ్ అధికంగా తీసుకునేవారిలో జ్ఞాపకశక్తి తగ్గడంతో పాటు అధిక ఒత్తిడికి కూడా గురవుతున్నారని పరిశోధనలో తేలింది. జంక్‌ఫుడ్ తిన్నవారిలో ఒత్తిడి కారణంగా హృద్రోగాలు, కేన్సర్‌లకు కూడా దారితీస్తుంది. అందుకే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, పిజ్జాలు, ఫ్రైడ్ ఐటమ్స్, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి ఆహార పదార్థాలు తినడాన్ని తగ్గించడం ద్వారా హృద్రోగ సమస్యలు దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. 


బయట దొరికే జంగ్ ఫుడ్


ప్రస్తుతం మన రాష్ట్రంలో ఒబెసిటి బారిన పడే వారి సంఖ్య ప్రతి యేటా పెరుగుతూనే ఉంది. వీరిలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం లెక్కల ప్రకారం 17.6 శాతం పురుషులు, 27.7 శాతం స్త్రీలు ఒబెసిటీతో బాధపుడుతున్నారు. చిన్నారుల్లో 21 శాతం మంది ఒబెసిటీతో బాధపడుతున్నారు.జంక్ ఫుడ్స్‌పై తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాలి. ప్రాశ్యాత్య సంస్కృతిని అనుకరించడం తగ్గించుకోవాలి. ఆరోగ్య సమస్యలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి

మరింత సమాచారం తెలుసుకోండి: