ఆంధ్రా రాజకీయాలు మరీ దారుణంగా తయారవుతున్నాయి. రాష్ట్రస్థాయి నేతలు కూడా గల్లీ లీడర్ల కంటే అధ్వాన్నంగా ప్రవర్తిస్తున్నారు. విపక్ష నేత వైఎస్ జగన్ పై ఆంధ్రా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ప్రెస్ మీట్లో గతంలో ఏ మంత్రీ ప్రవర్తించని విధంగా జగన్ పై వీరావేశం ప్రదర్శించారు. 

సింపుల్ గా చెప్పాలంటే జగన్ ను బూతులు తిట్టడం ఒక్కటే మిగిలిపోయింది. ఒకదశలో.. నీ.. అంటూ బూతులు తిట్టబోయి తమాయించుకుని ఆగిపోయారు. మరి దేవినేనికి ఇంత కోపం ఎందుకొచ్చింది. మంత్రిగారి సొంత జిల్లాలో విషజ్వరాల మరణాలపై మచిలీపట్నంలో జగన్ ధర్నా చేయడమే దానికి కారణం. ఆ ధర్నాలో ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్ ను కూడా మోసం చేస్తోందని జగన్ విమర్శించారు. 

జగన్ విమర్శలపై స్పందించిన దేవినేని మనిషి ఎదురుగా ఉంటే ఎలా తిడతామో అదే రేంజ్ లో తిట్టేశారు. ఏం జగన్.. పిచ్చపిచ్చగా ఉందా..అంటూ రెచ్చిపోయారు. ఎక్కువ మాట్లాడితే తాట తీస్తా ఏమనుకుంటున్నారో అంటూ ఘాటు పదజాలం వాడారు. నువ్వూ.. నీ బతుకూ.. ఛీ.. అంటూ ఛీత్కరించేశారు. నువ్వూ.. నీ అరాచకాలు అన్నీ బయటకు ఈడుస్తానని హుంకరించారు. 

తాను ముఖ్యమంత్రి అవుతానని జగన్ కలలు కంటున్నాడని ఎద్దేవా చేసిన దేవినేని.. నువ్వు 11 కేసుల్లో మొదటి ముద్దాయిగా ఉన్నావు.. ప్రతి శుక్రవారం.. జగన్మోహన్ రెడ్డీ.. హాజరీ.. జగన్ మోహన్ రెడ్డీ హాజరీ.. జగన్ మోహన్ రెడ్డీ.. హాజరీ.. ఛీ.. ఇదీ నీ బతుకు అంటూ మూడుసార్లు యాక్షన్ చేసి మరీ ఎద్దేవా చేశారు. జిల్లాలో తిరుగుతూ ఏడిచిన ఏడుపు ఏడవకుండా ఏడుస్తున్నావా.. అంటూ మండిపడ్డారు.

యు ఆర్ ఏ ఛీటర్.. ఛీటర్.. ఛీటర్.. అంటూ ముమ్మారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి విమర్శనూ మూడుసార్లు రెట్టిస్తూ.. జగన్ పై రెచ్చిపోయారు. ఓ మంత్రి జగన్ పై ఈస్థాయిలో తిట్లపురాణం అందుకోవడం ఈమధ్య కాలంలో ఇదే మొదటిసారి. 



మరింత సమాచారం తెలుసుకోండి: