తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత ఏపీకి ప్రత్యక హోదా కోసం పోరాటాలు మొదలు అయ్యాయి. ముఖ్యంగా నటుడు, రాజకీయ నాయకుడు శివాజీ ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేయడం మొదలు పెట్టాడు... దీనికోసం జలదీక్ష,నిరాహార దీక్షలు కూడా చేపట్టాడు. అడ్డగోలుగా విభజన జరిగిన సమయంలో కనీసం ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడం వల్ల ఇక్కడ ప్రజలకు న్యాయం చేకూరుతుందని ఆయన వాదిస్తున్నారు. తాజాగా శివాజీ వైసీపీ అధినేత జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికే ప్రయత్నిస్తున్నారు తప్ప రాష్ట్ర పరిస్థితి పై క్షుణ్ణంగా ఆలోచించడం లేదని .. రాజధాని భూములు అంటూ.. ఓటుకు నోటు కేసులు అంటూ టీడీపీపై అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యక్తిగత దూషనలు చేస్తున్నారే తప్ప రాష్ట్ర పరిస్థితి గమనించడం లేదు అన్నారు. దమ్ముంటే ఆయన ప్రతిపక్ష హోదాలో ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక హోదాపై నిలదీయాలని అన్నారు. వైసీపీ అధినేత తన స్వార్థం కోసం ప్రజలను బలిచేస్తున్నారని మండిపడ్డారు.

ప్రత్యేక హోదాపై శివాజీ పోెరాటం


వైసీపీ ఎంపీలు పార్లమెంటులో ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు నోరెత్తరని ప్రశ్నించారు.  ఎప్పటికీ చంద్రబాబును విమర్శిస్తే ప్రజల వద్ద తన హోదా పెరుగుతుందనే ఆలోచనలో ఉన్నారే తప్ప ప్రత్యేక హోదా అంశంపై గట్టిగా పట్టుబట్టడం లేదని విమర్శించారు. . వైసీపీ అధినేత జగన్ చేసే ఆంధోళనలు వారి రాజకీయ లబ్థికోసమేనాని, దీని వల్ల ప్రజలకు ఎలాంటి లాభం చేకురదని తెలిపాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విపక్ష నేత జగన్ మధ్య ఆధిపత్య పోరు సాగుతోందని అన్నాడు. కానీ వారిద్దరి పోరు నడుమ ఆంధ్రప్రదేశ్ నలిగిపోతోందని శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు


మరింత సమాచారం తెలుసుకోండి: