ఈ మద్య కాలంలో మహిళలపై రోజు రోజు కు పెరుగుతున్న అత్యాచారాలు అన్నీ ఇన్నీ కావు.. ప్రభుత్వాలు ఎన్ని  కఠిన చట్టాలు తీసుకు వచ్చినా ఈ కామాంధులు మాత్రం తమ దుశ్చర్యలు ఆపడం లేదు. పొద్దున్నే లేచిన మొదలు పేపర్లో,టీవీ చానల్లో,వెబ్ న్యూస్ ల్లో ఎక్కడ చూసినా మహిళలపై,యువతులపై కామాంధులు అత్యాచారాలకు వడికట్టారనో.. హత్య చేశారానో వార్తలు వస్తూనే ఉన్నాయి.

మహిళలపై రోజురోజుకూ పెరిగిపోతున్న లైంగిక దాడులు, అత్యాచారాలను అడ్డుకునేందుకు ఒక యువతి ఉద్యమించింది  అంటే ఎతో జనాలను వెంట వేసుకొని కాదండీ బాబూ.. మహిళల కోసం ప్రత్యేక రక్షణ కవచం ఏర్పాటు చేసింది..తమిళనాడులోని చెన్నైకు చెందిన యువతి మనీషా మోహన్. అమెరికాలో మిట్‌ మీడియా ల్యాబ్‌లో చదువుతున్న మనీషా మోహన్‌.. మహిళలు ధరించే ‘బ్రా'నే వారికి సహాయపడేలా రక్షణ కవచంగా తయారు చేసింది. ఆమె రూపొందించిన ఈ బ్రాను తాకిన వారికి 3,800 కిలోవాట్ల విద్యుత్‌ షాక్‌ కొడుతుంది.

షాక్ కొట్టే బ్రా


ఆ.. అమ్మాయే కదా.. అక్కడ పట్టుకుని ఓ టీజింగ్ చేద్దాం... కుదిరితే అత్యాచారం చేద్దామని ఆకతాయిలు ప్రయత్నం చేశారో.. హై ఓల్టేజీ షాక్ కొడుతుంది.దులో అమర్చిన జీపీఎస్‌ సహాయంతో సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు ఒక సందేశం పంపే వ్యవస్థ కూడా ఉంది. ఇటీవలే ఆమె రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ముందు దీని పనితీరును ప్రదర్శించి ఆయన ప్రశంసలు కూడా పొందింది. సో ఇంకా ముందు ముందు అమ్మాయిలకు రక్షణ మార్గాలు ఏవిధంగా రూపొందించాలో మనీషా మోహన్ ఆలోచిస్తూ ఉందట. ఇలా అయితే పోకిరిల బెడద కాస్తో కూస్తో దగ్గే అవకాశం ఉంటుందని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: