తెలుగు రాష్ట్రాలు రెండు గా విడిపోయిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదాపై రగడ మొదలైంది. కొత్త ఏర్పడిన రాష్ట్రం కాబట్టి రాష్ట్ర అభివృద్ది, నిరుద్యోగ సమస్యలు తీరుతాయన్న ఉద్దేశ్యంతో ప్రత్యేక హోదా గురించి పోరాటం మొదలైంది. ఇప్పటికే దీనిపై ప్రతిపక్ష పార్టీ, సినీ నటుడు శివాజీ,కాంగ్రెస్ పార్టీ రాస్గారోకోలు, ధర్నాలు, ఉద్యమాలు మొదలు పెట్టారు. ఈ మద్య మునికోటి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ ఉదంతం మరువక ముందే మరో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హృదయాలను కలిచి వేసింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వేదాయపాలెంలో ప్రత్యేక హోదా కోసం మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. విభజన నేపథ్యంలో ఔట్ సోర్సింగులో పని చేసే అతని ఉద్యోగం పోయింది, ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా కావాలని సూసైడ్ నోట్ రాసి అతను అత్మహత్య చేసుకున్నాడు. వేదాయపాలెంకు చెందిన లక్ష్మయ్య హౌసింగ్ బోర్డులో ఔట్ సోర్సింగులో ఉద్యోగం చేసేవాడు. విభజన అనంతరం ఆయన ఉద్యోగం పోయింది. ఆయన వయస్సు 53 వరకు ఉంటుంది. ఈ వయస్సులో తనకు మరోచోట ఉద్యోగం రాదని అథను కలత చెందాడు.

ఆత్మహత్య చేసుకున్న మునికోటి


జై ప్రత్యేక హోదా, జైజై ప్రత్యేక హోదా అని అందులో పేర్కొన్నారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన అందులో పేర్కొన్నారు.ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి లక్ష్మయ్య ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి వద్ద సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక హోదా కోసం తాను చనిపోతున్నట్లు లక్ష్మయ్య సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: