ఆంద్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పై మంత్రి దేవినేని ఉమ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ తన చరిత్ర ఏమిటో తెలియకుండా పట్టపగలే  పగటి కలలు కంటున్నాడు అంటూ ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రినవుతానని జగన్‌ పిట్టల దొరలా మాట్లాడుతున్నారు..ఆయన మాట్లాడుతంటే.. ఊర్లో తిరిగే  పిట్టల దొర  పిచ్చి మాటలన్నీ గుర్తుకు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, అపుడు రాజధానికి కోసం బలవంతంగా తీసుకున్న రైతుల భూములను పువ్వుల్లో పెట్టి ఇస్తేస్తామంటూ బుధవారం గుంటూరులో జరిగిన వైకాపా ధర్నాలో జగన్ చేసిన వ్యాఖ్యలపై దేవినేని మండిపడ్డారు.

రాజధాని నిర్మాణానికి ప్రజలు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారన్నారు. జగన్‌, వైసీపీ నేతలు లక్ష ఎకరాలు కొట్టేశారని , జ11 సీబీఐ కేసుల్లో, ఎన్ ఫోర్స్ మెంట్ సుప్రీంకోర్టులో డైరెక్షన్ లు కేసులు వాయిదా పడుతున్నాయన్నారు. ప్రతి శుక్రవారం హాజరై సంతకం చేయాల్సిన జగన్ మా నాయకుడిని విమర్శిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ‘జగన్‌లాంటి దొంగలను రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని, జగన్‌ మోసాలను ప్రజలు తిప్పి కొట్టారని, ప్రతిపక్ష నేతగా ఉండే అర్హత జగన్‌కు లేదు’ అని ఆయన విమర్శించారు . పోలవరం, రాజధాని నిర్మాణం ఆపడానికి కొందరు జర్నలిస్టులతో పిటిషన్లు వేయిస్తూ జగన్‌ కుట్ర చేస్తున్నారని దేవినేని ఉమ ఆరోపించారు .

ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న వైఎస్ జగన్


జగన్ లాంటి 420, దొంగలను ప్రజలు రానివ్వరని తెలిపారు. 2014 ఎన్నికల్లో ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తే ప్రజలు తిప్పికొట్టారని పేర్కొన్నారు. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి పోలవరం డ్యాం నిర్మాణం కాకుండా సుప్రీంలో కేసులు వేయిస్తున్నాడని ... ప్రతిపక్ష నేతగా ఉండే అర్హత జగన్‌కు లేదు" అని ఆయన విమర్శించారు. నవ్యాంధ్ర రాష్ట్రంలో ఇలాంటి ప్రతిపక్ష నేత ఉండటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని దేవినేని మండిపడ్డారు. పోలవరం, రాజధాని నిర్మాణం ఆపడానికి కొందరు జర్నలిస్టులతో పిటిషన్లు వేయిస్తూ జగన్‌ కుట్ర చేస్తున్నారని దేవినేని ఉమ ఆరోపించారు .


మరింత సమాచారం తెలుసుకోండి: