టైటిల్ చూసి కన్ ఫ్యూజ్ కాకండి.. మీరు చదివింది చిరంజీవి కాదు సుమండీ.. సిరంజీవి.. అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో మహిళలకు సిరంజీలతో ఇంజిక్షన్లు ఇస్తూ హడలెత్తిస్తున్న సైకో గురించి. అతన్ని పట్టిస్తే అక్షరాలా లక్ష రూపాయలు బహుమానం ఇస్తామని ప్రకటిస్తున్నారు పోలీసులు. ఈ జిల్లాలో నాలుగైదు రోజులుగా ఇదే హాట్ టాపిక్.

ఒంటరిగా ఉన్న ఆడవాళ్లను ఎంచుకోవడం.. ముఖానికి ముసుగు తగిలించుకుని వారిపై సిరంజీతో దాడి చేయడం.. ఇదీ ఈ సైకో పని. వరుసగా జరుగుతున్న ఈ మహిళలపై ఇంజక్షన్‌ ఘటనలతో ఆ జిల్లాలో ఆడాళ్లు హడలెత్తిపోతున్నారు. ఇప్పటివరకూ ఇతని బారిన 9 మంది వరకూ మహిళలు దాడులకు గురయ్యారు. ఐతే.. వారి ఆరోగ్య పరిస్థితి 
బాగానే ఉంది. 

లేటెస్టుగా పోలీసులు కొత్త వాదన వినిపిస్తున్నారు. సైకోగా భావిస్తున్న అతను గుచ్చుతోంది కేవలం సూది మాత్రమేనని.. ఎలాంటి రసాయనాలు ఎక్కించడం లేదని అంటున్నారు. ఈ సిరంజీ సైకోను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 40 బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. ఇప్పటికే ఇతగాడి ఊహా చిత్రాన్ని సిద్దం చేసిన అధికారులు దాని ఆధారంగా వేట సాగిస్తారట. 


ఈ సైకో మొదట.. ఉండి మండలం యండగండి వద్ద ఇద్దరు విద్యార్థినులకు, ఆ తరవాత పాలకోడేరు మండలంలో ఇద్దరు విద్యార్థినులకు సూది పొడిచారు. ఆ తరవాత  ఒక మహిళా కండక్టర్‌కు, గణపవరం సమీపంలో ఓ మహిళకు ఇంజక్షన్‌ ఇచ్చాడు. ఆ తరవాత పెనుగొండ మండలం సిద్దాంతం, చెరుకువాడ గ్రామాల్లో ఇద్దరు మహిళలకు ఇంజక్షన్లు ఇచ్చాడు. మరి ఈ సూది సైకో ఎప్పుడు దొరుకుతాడో.. పశ్చిమగోదావరి జిల్లాలో మహిళలు ఎప్పుడు నిర్భయంగా బయట తిరగగలుగుతారో..!? 



మరింత సమాచారం తెలుసుకోండి: