రాజకీయ నాయకుడికి తపన ఒక్కటే కాదు.. ఓర్పు ఉండాలి. అదను చూసి ఎత్తు వేయగలిగే నేర్పు ఉండాలి. ఊరికే ఆవేశపడిపోతేనో.. ఊరికే ఆరాటపడిపోతేనో.. పనులు కావు.. ఈ విషయం కుర్ర నాయకుడైన జగన్ మోహన్ రెడ్డికి ఇంకా అనుభవంలోకి రావడం లేదు. పూర్తిస్థాయి రాజకీయ నేతగా ఎదిగి.. ఓ పార్టీ అధ్యక్షుడైన తరవాత కూడా ఆయన ఇంకా ఎలా మాట్లాడాలో తెలుసుకోవడం లేదు. 

జగన్ మోహన్ రెడ్డికి సీఎం కుర్చీ అంటే అపారమైన అభిమానం. అంతే కాదు.. సాధ్యమైనంత త్వరగా ఆ కుర్చీలో కూర్చోవాలన్నది ఆయన ఆరాటం. కానీ ఉత్త ఆరాటంతో పనులు కావు కదా..గతఎన్నికల్లో ఓటమితో మరో నాలుగేళ్ల వరకూ ఆ కుర్చీ ఎక్కే అవకాశం లేదు.. అలాంటప్పుడు ఇంకా ఆ పదవిలోకి వచ్చేస్తానంటూ ఊరికే బహిరంగంగా చెప్పుకోవడం ఆయన్ను నవ్వుల పాలు చేస్తోంది. 

జగన్ సీరియస్ గా ఆందోళనలు చేస్తున్నారు.. అంతే సీరియస్ గా ఉద్యమాలు చేస్తున్నారు. రాజకీయాల్లో అనుభవం సంపాదిస్తున్నారు. కానీ ఏం లాభం.. ప్రతిసారీ నేను ముఖ్యమంత్రినవుతా.. అప్పుడు మీ కష్టాలు తీరుస్తా అంటూ మాట్లాడేసరికి.. అప్పటివరకూ ఉన్న సాఫ్ట్ కార్నర్ కాస్తా గోవిందా అవుతోంది. ఇటీవల కృష్ణాజిల్లాలో రాజధాని భూసేకరణ విషయంపైనా.. విషజ్వరాల బాధితులపైనా జగన్ ధర్నాలు చేశారు. 

జగన్ ధర్నాలకు స్పందన కూడా బాగానే ఉంది. అలాంటి చోట కూడా జగన్.. నేను ముఖ్యమంత్రి కాగానే మీ భూమలు మీకిచ్చేస్తా.. నేను ముఖ్యమంత్రిని కాగానే జ్వర బాధితులకు పరిహారం అందిస్తా అనిచెప్పడం పొలిటికల్ కామిడీగా మారుతోంది. జగన్ దృష్టంతా ఆ పదవిపైనే ఉందని.. అందుకే అలా మతిభ్రమించి మాట్లాడుతున్నారని పలువురు టీడీపీ  మంత్రులు జగన్ మాటలపై విమర్సలు గుప్పించారు. జగన్ కూడా ఈ అలవాటు మానుకుంటే మంచిదేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: