కొలంబో: పడిలేచిన కెరటంలా అనూహ్యంగా శ్రీలంకను ఓడించిన టీం ఇండియా మూడొ సిరీస్ గెలుపు పై కన్నేసింది, శ్రీలంక కూడా చివరి టెస్టు గెలవాలని పట్టుదలతో తలపడుతున్నాయి, మూడో టెస్ట్ శుక్రవారం ఉదయం శ్రీలంక రాజధాని కొలంబోలో ప్రారంభమైంది. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన ఆతిథ్య శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. భారత్ బ్యాటింగ్‌కు దిగింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. 


15 ఓవర్లకు 50 పరుగులు పదిహేను ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి, 50 పరుగులుచేసింది. కోహ్లీ 34 బంతుల్లో 14 పరుగులు, పుజారా 42 బంతుల్లో 19 పరుగులు చేశారు. ఆదిలో రెండు వికెట్లు ఆరంభంలోనే భారత్‌కు షాక్ తగిలింది. తొలి ఓవర్లో భారత ఓపెనర్ లోకేశ్ రాహుల్ (2)ను శ్రీలంక ఫేసర్ దమ్మిక ప్రసాద్ పెవిలియన్ చేర్చాడు. 

తొలి ఓవర్‌ను నో బాల్‌తో మొదలుపెట్టిన ప్రసాద్


తొలి ఓవర్‌ను నో బాల్‌తో మొదలుపెట్టిన ప్రసాద్ తన రెండో బంతికే లోకేశ్ రాహుల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత రాహుల్ స్థానంలో క్రీజులోకి వచ్చిన అజింక్యా రహానే (8) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. నాలుగో ఓవర్ నాలుగో బంతికి నువాన్ ప్రదీప్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో నాలుగు ఓవర్లు పూర్తి కాకుండానే భారత్ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిపోయింది.


నాలుగు ఓవర్లు ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి భారత్ 15 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ, చటేశ్వర పుజారా నిలకడగా ఆడుతున్నారు. పది ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది. పుజారా (30 బంతుల్లో 13 పరుగులు), కోహ్లీ (16 బంతుల్లో 9 పరుగులు)తో క్రీజులో ఉన్నారు. 


ఇరు జట్లు
భారత జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), కెఎల్ రాహుల్, ఛటేశ్వర పుజారా, అజింక్యా రహానే, రోహిత్ శర్మ, స్టార్ట్ బిన్నీ, నమన్ ఓఝా (వికెట్ కీపర్), అశ్విన్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, అమిత్ మిశ్రా
 శ్రీలంక జట్టు: మాథ్యూస్ (సారథి), కరుణరత్నే, కౌషల్ సిల్వ, ఉపుల్ తరంగ, లహిరు తిరమన్నే, దినేష్ చండీమల్, కౌషల్ పెరారే (వికెట్ కీపర్), ధమ్మిక ప్రసాద్, నువాన్ ప్రదీప్, తరిందు కౌషల్, రంగన హెరాత్...


మరింత సమాచారం తెలుసుకోండి: