దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ ఏబీ డీవిలియనర్స్ మరో అరుదైన రికార్డు సాధించాడు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన వన్డే మ్యాచ్‌లో డీవిలియర్స్ అర్ధ సెంచరీ(64)తో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ రికార్డుని బద్దలు కొట్టాడు.
 

ఏబీ డీవిలియర్స్ వన్డేల్లో అత్యంత వేగంగా ఎనిమిది వేల పరుగుల మైలు


31 ఏళ్ల ఏబీ డీవిలియర్స్ వన్డేల్లో అత్యంత వేగంగా ఎనిమిది వేల పరుగుల మైలు రాయిని సాధించాడు. ఇప్పటి వరకూ గంగూలీ పేరిట ఉన్న ఎనిమిది వేల వన్డే పరుగుల రికార్డుని అధిగమించాడు. ఎనిమిది వేల పరుగుల మైలు రాయిని సాధించేందుకు సౌరభ్ గంగూలీకి 200 ఇన్నింగ్స్‌లు అవరసమైతే, అదే ఏబీ డీవిలియర్స్‌ 182 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించాడు.
 

ఈ మైలురాయిని చేరుకోవడానికి సౌరభ్ గంగూలీకి 200 ఇన్నింగ్స్ అవసరం కాగా, సచిన్ టెండూల్కర్‌కు 210 ఇన్నింగ్స్ అవసరమయ్యాయి. ఇప్పటికే వన్డేల్లో అత్యం వేగవంతమైన అర్ధ సెంచరీ, సెంచరీ, 150 పరుగుల రికార్డులు దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డీవిలియర్స్ పేరు మీదనే ఉన్న సంగతి తెలిసిందే. బుధవారం నాడు జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 62 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.


అత్యంత వేగంగా 8,000 పరుగులు చేసిన ఆటగాళ్లు (టాప్ 5)
 * ఏబీ డీవిలియర్స్ - 182 ఇన్నింగ్స్‌లు
 * సౌరభ్ గంగూలీ - 200 
* సచిన్ టెండూల్కర్ - 211
 * బ్రియాన్ లారా - 211
 * మహేంద్ర సింగ్ ధోని - 214


మరింత సమాచారం తెలుసుకోండి: