ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం ప్రతి పక్షనాయకులు, నటుడు శివాజీ లాంటి వారు పోరాడుతున్న సమయంలో ముని కోటి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తెలుగు రాష్ట్రాలు రెండు గా విడిపోయిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదాపై రగడ మొదలైంది. కొత్త ఏర్పడిన రాష్ట్రం కాబట్టి రాష్ట్ర అభివృద్ది, నిరుద్యోగ సమస్యలు తీరుతాయన్న ఉద్దేశ్యంతో ప్రత్యేక హోదా గురించి పోరాటం మొదలైంది. ఇప్పటికే దీనిపై ప్రతిపక్ష పార్టీ, సినీ నటుడు శివాజీ,కాంగ్రెస్ పార్టీ రాస్గారోకోలు, ధర్నాలు, ఉద్యమాలు మొదలు పెట్టారు.

ఇక ప్రత్యేక హోదా కోసైం ప్రాణ త్యాగాలు కూడా మొదలైనాయి..  ఆ మద్య మునికోటి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే..లక్ష్మయ్య అనే వ్యక్తి  ఆత్మహత్య చేసుకున్నాడు.. తాజగా ఉదయభాను,లోకేష్‌ అనే ఇద్దరు వ్యక్తులు స్పెషల్‌ స్టేటస్‌ రాదనే మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు.కృష్ణాజిల్లా గుడివాడ శ్రీరామపురం కాలనీకి చెందిన శిరిపురం ఉదయభాను(40) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడుమరోవైపు కర్నూల్‌కు చెందిన లోకేష్‌ స్పేషల్‌ స్టేటస్‌ కోసం అత్మహత్య చేసుకున్నాడు.


ఆత్మహత్య చేసుకున్న మునికోటి


ప్రత్యేక హోదా సమాఖ్య కార్యకర్తలతో నిన్న కర్నూల్‌ బిజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన లోకేష్ ఇవాళ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఇలాగే పరిస్థితి కొనసాగితే రోజురోజుకి బలిదానాలు చేసుకునే వారి సంఖ్య పెరుగుతుందని ప్రత్యేక హోదా సమాఖ్య కమిటీ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఈ ఆత్మహత్యతో ఆ కుటుంబంలో విషాదం నేలకొంది. ప్రత్యేక హోదాకోసం ఆత్మహత్యలకు పాలప్పడవద్దని దానిని పోరాడి సాదించుకోవాలని శివాజీ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: