ఈ రోజు అన్నాదమ్ముల అనుబంధానికి సాక్షిగా రక్షాబంధన్ గోప్ప పండుగ. ఆడపడుచుకు జీవితాంతం రక్షణగా ఉండాలని అన్నకు,తమ్ముడికి అక్కా,చెల్లి కట్టే రాఖి అనాధిగా వస్తున్న ఆచారం. దేశం ఎంత ముందుకు వెళ్తున్నా..టెక్నాలజీ ఎంత పెరిగినా ఈ రక్షా బంధనం మాత్రం ఎప్పటికీ కొనసాగే పండుగే.. దేశ విదేశాల్లో సైతం ఈ పండుగా ఘనంగా జరుపుకుంటారు. శ్రావణ మాస పౌర్ణమి రోజు చేసుకునే ఈ పండుగను ఒక్క భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ జరుపుతారు.

మారిషస్, నేపాల్, పాకిస్థాన్‌ ల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ వేడుక జరుగుతుంది. వీరే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఉన్నభారతీయులు కూడా ఈ పండుగను చేసుకొంటారు. ప్రధానంగా హిందువులు, సిక్కులు, జైనులు రాఖీ పౌర్ణమిని జరుపుకొంటారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించే మహిళల నుంచి బస్సు ఛార్జీలు వసూలు చేయవద్దని ముఖ్యమంత్రి హరీష్ రావత్ తెలిపారు.  ఉత్తరాఖండ్ లో మహిళలకు అక్కడి ప్రభుత్వం రక్షాబంధన్ కానుకను ఈ విధంగా ప్రకటించింది.

రక్షాబంధన్


దూర ప్రాంతాల్లో ఉన్న సోదరులకు రాఖీ కట్టేందుకు సోదరిలు తాపత్రాయ పడతారని, అలాంటి వారికి ఇబ్బందులు తలెత్తకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. మహిళా గౌరవానికి ప్రతీకగా రక్షా బంధన్ నిలుస్తుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. రాష్ట్ర మహిళలకు రక్షాబంధన్ శుభాకాంక్షలని ఆయన చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: