తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌బోతున్న నూత‌న మద్యం పాల‌సీ తో రాష్ట్ర రాజకీయాలు ఒక్క‌సారిగా మారిపోయాయి. అధికార టీఆర్ఎస్ ప్ర‌భుత్వం నూత‌న మ‌ద్యం పాల‌సీలో భాగంగా చీప్ లిక్కర్ ను ప్ర‌వేశ పెట్ట‌బోతుంది. దీంతో 90 యంయ‌ల్ చీప్ లిక్క‌ర్ మ‌ద్యం  రూ.20 రూపాయ‌ల‌కు రాబోతుంది. వీటి ద్వారా రాష్ట్రం లో ఏరులై పారుతున్న గుడుంబా ను అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. మ‌రోవైపు మద్యం పాల‌సీని తీసుకువ‌స్తున్న ప్ర‌భుత్వం పై ప్ర‌తిప‌క్షాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి. వెంట‌నే ఈ చీఫ్  పాల‌సీని ఆపివేయాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. జిల్లాల్లో మ‌హిళ‌లు, ప్ర‌జ‌లు ర‌హ‌దారుల‌పై రాస్తారోకో చేస్తున్నారు.  ప్ర‌భుత్వం తీసుకువ‌స్తున్న చౌక మ‌ద్యం తో తెలంగాణ రాష్ట్రం బొంద‌ల‌గ‌డ్డ‌గా మారుతుంద‌ని మ‌హిళ‌లు నినందిస్తున్నారు. ప్ర‌తిప‌క్ష‌ రాజ‌కీయ నాయకులు మాత్రం ఈ మ‌ద్యం పాల‌సీని ఆస‌రాగా చేసుకుని ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల ముందు క‌డిగేయాల‌ని యోచిస్తోంది. 

చీప్ లిక్క‌ర్ తీసుకురావాల‌నే ప్ర‌భుత్వ నిర్ణ‌యం


చీప్ లిక్క‌ర్ తీసుకురావాల‌నే ప్ర‌భుత్వ నిర్ణ‌యం పై రాష్ట్రంలో రోజురోజుకీ వ్య‌తిరేక‌త తీవ్రమౌతుంది. వృతిని దెబ్బ తీసి పొట్ట‌గొట్టొద్ద‌ని గీత కార్మికులు,లిక్క‌ర్ తెచ్చి కుటుంబాల్లో చిచ్చుపెట్టొద‌ని మ‌హిళ‌లు రోడ్డెక్కుతున్నారు. క‌రీంన‌గ‌ర్, నిజామాబాద్ జిల్లాల్లో శుక్ర‌వారం ర‌హ‌దారుల‌పై రాస్తారోకోలు చేప‌ట్టారు. చీప్ పాల‌సీ నిర్ణ‌యాన్ని వెంట‌నే ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఈ ఉద్య‌మం ఒక్క జిల్లాకే ప‌రిమితం కాలేదు.. జిల్లాలో అన్ని మండలాల్లో ఈ ఉద్య‌మం తీవ్ర త‌రం చేశారు. ఆయా మండ‌ల త‌హ‌శీల్ధార్ ల‌కు  విన‌తి ప‌త్రాల‌ను అందజేశారు.  కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీయం పార్టీ నాయ‌కులు సైతం ఉద్య‌మాన్ని తీవ్ర‌త‌రం చేశారు.  మ‌రో వైపు మ‌హిళా సంఘాలు ప్ర‌భుత్వం తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి. చౌక మ‌ధ్యం విధానం వ‌ల్ల తెలంగాల‌న ప్రాంత మంతా బొంద‌ల‌గ‌డ్డగా మార‌బోతుంద‌ని మ‌హిళ సంఘాల ప్ర‌తినిధులు అందోళ‌న వ్య‌క్తం చేశారు. 


ఎన్నిక‌ల సందర్భంగా చేసిన వాగ్దానాలు నిల‌బెట్టుకోవ‌డం మ‌రిచిన సీఎం కేసీఆర్ మ‌హిళ‌లు వ్య‌తిరేకించే చీప్ లిక్క‌ర్ తీసుకురావ‌మెందుక‌ని ప్ర‌శ్నించారు. గ‌త 12 రోజులుగా తెలంగాణ జిల్లాల్లో చీప్ లిక్క‌ర్ విధానానికి వ్య‌తిరేకంగా ఐద్వా బ‌సు యాత్రా చేశారు. ఈ కార్య‌క్రమం ముగింపు సంద‌ర్బంగా హైద‌రాబాద్ లోని ఇందిరాపార్క్ వ‌ద్ద మ‌హ‌స‌భ‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లు నాయకులు పాల్గొన్ని ప్ర‌భుత్వ విధానం పై విరుచుకుపడ్డారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మ‌ల్లు స్వ‌రాజ్యం మాట్లాడారు. సీఎం ద‌మ్ము, ధైర్యం ఉంటే పెరిగిన నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌లు త‌గ్గించ‌లన్నారు. సంక్షేమ ప‌థ‌కాలు అంద‌రికీ అందేలా చ‌ర్య‌లు చేపట్టాల‌న్నారు. ఆరోగ్యం పాడుచేసే మ‌ద్యం తేవ‌డ‌మేమిట‌ని ప్ర‌శ్నించారు.  మ‌రోవైపు..  చీప్ లిక్క‌ర్ పై చీప్ పాలిటిక్స్ చేస్తున్న విప‌క్షాల‌కు మంత్రి ప‌ద్మారావు స్ట్రాంగ్ కౌంట‌రే ఇచ్చారు. 

చీప్ లిక్క‌ర్ విష‌యంలో ప్ర‌తిప‌క్షాలు


చీప్ లిక్క‌ర్ విష‌యంలో ప్ర‌తిప‌క్షాలు అన‌వ‌స‌ర రాధ్ధాంతం చేస్తున్నా చేస్తున్నాయ‌ని పైర‌య్యారు. గుడుంబా వ‌ల్ల ఎంతో మంది చ‌నిపోతున్నార‌ని, 30 నుంచి 35 ఏళ్ల లోపే మ‌హిళ‌లు వితంతువులు అవుతున్నార‌ని పద్మారావు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌ల ఆయుష్షు పెంచ‌డానికి సీఎం కేసీఆర్ నూత‌న ఎక్సైజ్ పాల‌సీ తీసుకొచ్చార‌ని స్ప‌ష్టం చేశారు. చీప్ లిక్క‌ర్ ఎంత ఎక్కువ అమ్ముడుపోతే ప్ర‌భుత్వానికి అంత న‌ష్ట‌మ‌న్నారు. ఎంత న‌ష్ట‌మొచ్చిన స‌రే ప్ర‌జ‌లు బాగుండాల‌న్న‌దే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌న్నారు మంత్రి ప్ర‌ద్మారావు. గుడుంబా నియంత్ర‌ణ కు త్వ‌ర‌లోనే ఓ తేదీని ప్ర‌క‌టిస్తామ‌ని మంత్రి ప‌ద్మారావు చెప్పారు. ఆ త‌రువాత గుడుంబా క‌నిపిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. చీప్ లిక్క‌ర్ పై ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకొక‌ముందే విప‌క్షాలు ధ‌ర్నాలు నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు చేయ‌ట‌మేంట‌ని మంత్రి మండిప‌డ్డారు. 


అంతేకాకుండా  చీప్ లిక్క‌ర్ తో గౌడ కులస్తులకు నష్టమని చెబుతున్న కాంగ్రెస్ నేతలు దీటైన స‌మాదాన‌మే చెప్పారు. గ‌త 60 సంవ‌త్స‌రాలుగా అధికారంలో ఉన్న రాజ‌కీయ పార్టీలు గౌడ కుల‌స్థుల‌కు ఏం చేశారో చెప్పాలని పద్మారావు డిమాండ్ చేశారు. గౌడ కులస్తులు చనిపోతే 2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. చీప్ లిక్కర్ పై చిల్లర రాజకీయాలు మానుకోవాలని మంత్రి విపక్షాలకు సూచించారు. ప్రజల ఆరోగ్యం విషయంలో రాజకీయాలు తగదని హితవు చెప్పారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా ప్ర‌తిప‌క్షాల డిమాండ్ కూడా స‌రైన‌దేన‌ని ప‌లువురు వారిస్తున్నారు. కావాల‌ని ప్ర‌జ‌ల‌కు మ‌ద్యానికి బానిస చేయాల‌ని సూచిస్తున్నాయి. ఇంత వ‌ర‌కు అయానో భ‌యానో తాగేవారికి, ప్ర‌భుత్వం ఈ చీప్ మ‌ద్యం పాల‌సీతో ప్ర‌జ‌ల‌కు త్రాగాడానికి ప‌ర్మిష‌న్ ఇస్తున్నార‌ని వాపోతున్నారు.  


మ‌రోవైపు.. ఈ ఆందోళ‌న‌లు ప‌ట్టించుకోకుండా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నూత‌న మ‌ద్యం విధానం కొత్త సీసాలో పాత సారా లా ఉంది. 30 వేల జ‌నాభాకు ఒక బార్ లైసెన్స్ మంజూరుకు సిద్దం చేస్తున్నారు. ప్ర‌తి త్రీ స్టార్, పైవ్ స్టార్ హోట‌ళ్ళ‌లో 24 గంట‌లూ మద్యం అందుబాటులో ఉంటుంది కొత్త మార్గ‌దర్శ‌కాల ప్ర‌కారం రాష్ట్రంలో 90 బార్లు అద‌నంగా పెర‌గనున్నాయి. ప‌ల్లె ప‌ల్లెన చీప్ లిక్క‌ర్ ఏరులై పారనుంది.  పైగా ప్ర‌జ‌ల ఆయుషు పెంచేందుకే చీప్ లిక్క‌ర్ ను అందుబాటులోకి తెస్తున్న‌ట్టు గొప్ప‌లు చెబుతోంది. కాగా తెలంగాణ‌లో గుడుంబాకు బానిసై ప్ర‌జ‌లు ప్రాణాలు తీసుకుంటున్నార‌న్న మాట వాస్త‌వ‌మే కానీ, దీనికి ప‌రిష్క‌ర‌మార్గం వేరే ఎదైనా ఆలోచించాలే తప్పా ఈ మ‌ద్యం అప‌డానికి మ‌రో మ‌ద్యాన్ని ప్ర‌జల్లోకి తీసుకువస్తున్న ప్ర‌భుత్వం అలోచ‌న‌కు ఎంత వ‌ర‌కు మంచి ఫ‌లితాలు వ‌స్తాయో వేచి చూడాలి..!


మరింత సమాచారం తెలుసుకోండి: