తెలుగు మీడియా పార్టీల వారీగా చీలిపోవడంతో దాని దుష్పరిణామాలు ప్రెస్ మీట్లలోనూ కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు తమకు నచ్చని ప్రశ్నలు రాగానే.. ఆ విలేకరిపై నువ్వు పలానా పేపర్ కదా.. అంటూ ఎదురు దాడి చేస్తున్నారు. అసలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం మానేసి.. పేపరు పేరు చెప్పి తెలివిగా తప్పించుకుంటున్నారు. విలేకరులు కూడా అందుకు తగ్గట్టుగానే తయారవుతున్నారు. 

తమ పత్రిక అనుకూలంగా ఉన్న నాయకుడి ప్రెస్ మీట్ కు వెళ్లినప్పుడు నోరు మెదపకుండా కూర్చుంటున్నారు. అదే తమకు వ్యతిరేకమైన నాయకుడి ప్రెస్ మీట్ కు వెళ్తే మాత్రం తమలోని టాలెంట్ అంతా బయటకు తీసి రెచ్చిపోతున్నారు. ప్రశ్నలదాడి చేసి సదరు నాయకుడి నుంచి ఏదో ఒక వివాదాస్పద కామెంట్ రాబట్టే ప్రయత్నిస్తున్నారు. ఈ పిల్లి- ఎలుక వ్యవహారం ఇతర జర్నలిస్టులకు వినోదంగా మారుతోంది. 

శనివారం వైసీపీ బంద్ పూర్తియిన తర్వాత ప్రతిపక్ష నేత జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. బంద్ ను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ ప్రెస్ మీట్ పూర్తవుతున్న సమయంలో విలేకరులు కొన్ని ప్రశ్నలు అడిగారు. దానికి జగన్ సమాధానాలు చెప్పారు. ఆ సమయంలో ఏబీఎన్ రిపోర్టర్ అడిగిన ఓ ప్రశ్నకు జగన్ కు చిర్రెత్తించింది. జగన్ ఎప్పుడూ చంద్రబాబునే విమర్సిస్తారు. మోడీని ఎందుకు నిలదీయరు.. అంటూ ఏబీఎన్ రిపోర్టర్ ప్రశ్నించారు. 

ఏబీఎన్ రిపోర్టర్ ప్రశ్నతో జగన్ కాస్త ఆలోచనలో పడ్డారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం దాట వేసి ఎదురుదాడికి దిగారు. నువ్వు ఏబీఎన్ రిపోర్టరువని నాకు తెలుసులే తమ్ముడూ అంటూ విమర్శించడం మొదలుపెట్టారు. రాధాకృష్ణ నిన్ను ఇలాంటి ప్రశ్నలు అడగటం కోసమే పంపించాడులే అంటూ వ్యంగ్యోక్తులు విసిరారు. అక్కడితో ఆగలేదు. మీరు కూడా ఇక పచ్చచొక్కాలు వేసుకుని చంద్రబాబు పార్టీలో చేరిపోవచ్చుగా అంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: