ఏపీ సర్కారు తరలింపు ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు.. ఇతర కార్యాలయాల తరలింపు కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం భావిస్తున్నారు. ఇందుకు అవసరమైన కసరత్తులు పూర్తి చేస్తున్నారు. తాత్కాలిక రాజధాని ప్రాంతానికి ఉద్యోగులను తరలిస్తే.. దాదాపు 19 వేల మంది హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్లాల్సి వస్తుందని అధికారులు లెక్కలు తేల్చారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారు. ఆయన చాలా సీరియస్ గా ఈ విషయాన్ని ఫాలో చేస్తున్నారు. దాంతో ఇప్పుడు అందరూ వెళ్లక తప్పదనే సంకేతంతో ప్రభుత్వం ఉద్యోగుల్ని మానసికంగా సిద్ధం చేస్తోంది. ఐతే వారి  అభిప్రాయాలు తెలుసుకోకుండా గుడ్డిగా ముందుకు వెళ్తే పరిపాలనలో తేడా వస్తుందేమో అన్న భయం లేకపోలేదు. 

రలింపుతో అనేక ఇబ్బందులు తలెత్తనున్నాయి. పిల్లల స్థానికత అంశం ఇందులో ప్రధానంగా మారింది. వీటిపై సర్కారు ఓ నిర్ణయం ఇంకా తీసుకోలేదు. అందుకే ఈ తరలింపు అంశంపై సర్కారు ఉద్యోగులు అభిప్రాయాలు తెలుసుకుంటోంది. ఓ పది కీలమైన ప్రశ్నలతో కూడిన ఓ ప్రశ్నాపత్రాన్ని ఉద్యోగులకు అందించి.. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. 

దీనికితోడు వసతి సౌకర్యంపై కూడా ఇంతవరకూ క్లారిటీ లేదు. ఒక్కసారిగా ఇంత మంది జనాభా వెళ్తే..  విజయవాడకు ఆ రద్దీని తట్టుకునే కెపాసిటీ ఉందా లేదా అన్నది మరో అంశం. ఉద్యోగుల తరలింపు వల్ల విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలపై ప్రభావాన్ని అంచనా వేసి ఆమేరకు మౌళిక వసతులను అభివృద్ధి చేసిన తర్వాతే తరలింపు మొదలు పెట్టాలని యోచిస్తోంది. అందుకే ఉద్యోగుల ఫీడ్ బ్యాక్ రాగానే దానిని బట్టి నిర్ణయం తీసుకుంటారట. ఏదేమైనా తరలింపు మాత్రం సత్వరమే ఉంటుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: