కేసీఆర్ కూతురుగా పేరు వచ్చినా కవితకు తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జాగృతి పేరుతో సంస్థను ఏర్పాటు చేసి తనకంటూ కొంత ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. అందుకే నిజామాబాద్ ఎంపీగా సునాయసంగా గెలిచి పార్లమెంటు గడప తొక్కింది. పార్లమెంటులోనూ అడపా దడపా మాట్లాడుతూ తన ర్యాంకింగ్ మెరుగుపరచుకుంటోంది. 

ఉద్యమ సమయంలో ఆంధ్రా నేతలకు, ఆంధ్రులకూ వ్యతిరేకంగా మాట్లాడిన కవిత ఇప్పుడు ఏపీకి అనుకూలంగా మాట్లాడుతోంది. ఎవరి రాష్ట్రం వాళ్లకు వచ్చేశాక ఇంకా గొడవేముంటుంది అన్న ఆలోచన కావచ్చు. అంతే కాదు. అవసరమైతే ఏపీ తరపున పోరాటం కూడా చేస్తానంటోంది. కవిత అంతగా పోరాటం చేయాల్సిన అంశం ఏముందనుకుంటున్నారా.. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడం ఆమెకు ఆ అవకాశం కల్పిస్తోంది. 

ఈ సంగతి ఆమె స్వయంగా మీడియాకు చెప్పండి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన కవిత.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడింది. ప్రత్యేక హోదా కోసం ఏపీలో ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించిన కవిత.. పోరాటాల ద్వారానే ఏదైనా సాధించుకోవాలని పిలుపు ఇచ్చింది. విభజన చట్టంలోని హామీలు నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏపీ సర్కారుతో కలసి పోరాడేందుకు తాము సిద్దమని కవిత చెప్పింది. 

పనిలో పనిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆమె విమర్శలు కూడా గుప్పించేసింది. ప్రత్యేకహోదా అంశంపై చంద్రబాబు సరిగ్గా పోరాటం చేయడం లేదని విమర్శించారు. చంద్రబాబు కేంద్రాన్ని నిలదీస్తే ఫలితం తప్పకుండా ఉంటుందని కానీ.. బాబు ఆ పని చేయడం లేదని మండిపడింది. ఐతే.. హోదా విషయంలో ఏపీ యువత నిరాశానిస్పృహలకు లోను కావాల్సిన అవసరం లేదని ధైర్యంగా  పోరాడాలని కవిత పిలుపు ఇచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: