పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పుడు ఒక్కటే టాపిక్.. ఇంజక్షన్ నిడిల్ తో ఓ సైకో మహిళలను టార్గెట్ చేసి మరీ గుచ్చిపోతున్నాడు.. ఇప్పటికీ ఈ సైకో బారిన పడ్డవారు 19 మందికి చేరుకున్నారు.  మనుషుల్ని చంపేయడం లేదు ఆ సైకో.. జస్ట్‌ 'సూది'తో జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. అయితే ఇతడి టార్గెట్ ఏమిటో ఎవరికీ అర్థం కాక భయం గుప్లిట్లో బతుకుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాడో ఎలా వస్తున్నాడో ఎవరికీ తెలియదు. వస్తున్నాడు, సూది పోటు పొడిచేసి పారిపోతున్నాడు. బైక్‌ మీద వస్తున్నాడన్నది ఇప్పటిదాకా బాధితులు చెబుతున్నమాట.

ఆ సూదిలో ఏముందో కూడా ఇప్పటిదాకా ఎవరికీ తెలియని పరిస్థితి. ఇంజెక్షన్‌ కోసం వాడే సిరంజీ సూదిని ఆయుధంగా మార్చుకున్నాడు సైకో. కేవలం జనాన్ని భయభ్రాంతుల్ని చేయడమే సైకో ఉద్దేశ్యమా.? లేదంటే ఆ సూది ద్వారా ప్రమాదకరమైన వైరస్‌లనుగానీ ఇంజెక్ట్‌ చేస్తున్నాడా.? అర్ధం కాని ప్రశ్న..  పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న సైకో మొగల్తూరు మండలం ముత్యాలపల్లిలో ఆదివారం ప్రత్యక్షమయ్యాడు. గ్రామానికి చెందిన హారిక అనే మూడేళ్ల చిన్నారికి ఇంజక్షన్ ఇచ్చి పరారయ్యాడు. బాలిక ఏడుపుతో తల్లిదండ్రులు ఘటనాస్థలికి వచ్చేసరికి అక్కడి నుంచి సైకో పరారయ్యాడు.

పెంటపాడు మండలం గట్లపాలెంలో ఓ బాలుడికి ఇంజక్షన్ ఇచ్చి సైకో పరారయ్యాడు. పెనుగొండ, సిద్ధాంతం, కవిటం, బుదరాయుడు చెరువు గ్రామాల్లో ఆడవాళ్లకు ఇంజక్షన్ ఇచ్చి పరారయ్యారు. పల్సర్ వాహనంపై హఠాత్తుగా వచ్చిన ఇద్దరు యువకులు ఇంజక్షన్ చేసి మాయమయ్యారని బాధిత మహిళలు చెబుతున్నారు. ఇంజక్షన్ తో మత్తుకమ్మి పడిపోతున్నారు మహిళలు. సైకోల భారినపడ్డ మహిళలకు దగ్గర్లోని ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

సైకో బారిన పడి చికిత్స పొందుతున్న బాధితులు


భాదితుల సమాచారాన్ని తసుకొని సైకో ఊహాచిత్రాన్ని గీయించి ప్రచార మాద్యమాల ద్వారా ఇప్పటికే అతడిని పట్టుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పోలీసులు శక్తి వంచన లేకుండా ఆ సైకోని పట్టుకోవడానికి కృషి చేస్తున్నామంటున్నారు అయితే యువకులు కొంత మంది గుంపులుగా ఏర్పడి ఇలాంటి సంఘటన జరిగితే వెంటనే అప్రమత్తం కావాలని ప్రజలకు కూడా ధైర్యంగా ఉండి ఆ సైకోని పట్టుకోవడాని సహకరించాలని వారు విజ్క్షప్తి చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: