ఏపీ అసెంబ్లీలో టీడీపీ,వైసీపీల మద్య మాటల యుద్దం కొనసాగింది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యో రోజా చంద్రబాబుపై విరుచుకు పడ్డారు. శాసనసభ వాయిదా పడిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు.  అసలు ఏపీలో తెలుగు దేశం ప్రభుత్వ పాలన నియంతృత్వ దోరణిలో వెళ్తుందని వారి ఇష్టాను సారంగా పాలన కొనసాగిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఎక్కడా లేని వింతలు జరుగుతున్నాయని కనీసం ప్రతిపక్షం వారు చనిపోయిన వారికి నివాళులు అర్పించాలన్నా మైకులో కట్ చేస్తున్నారని అంతమాత్రాన అసెంబ్లీ ఎందుకు పెట్టారని అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


పుష్కరాల్లో అన్యాయంగా చనిపోయిన వారికి చంద్రబాబు నివాళులు అర్పిస్తున్నారని చేసిందంతా చేసి ఇప్పుడు సానుభూతి చూపిస్తే చనిపోయిన వారి ఆత్మలు కూడా శాంతించవని అన్నారు. సంతాప తీర్మానాలతో సరిపెట్టడం కాదని, వారికి పూర్తిగా పరిహారం ఇవ్వాలని, వారి మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలన్నది తమ డిమాండ్ అని అన్నారు.పుష్కర మరణాలకు కారకుడైన చంద్రబాబు తనకు ప్రజలు ముఖ్యం అంటూ కామెడి చేస్తున్నాడని ఆమె విమర్శించారు.జగన్ పై విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరావు తన కొడుకు యాక్సిడెంట్ చేస్తే చిల్లర ఇచ్చి, చంద్రబాబు ఆశీస్సులతో కేసు నుంచి బయటపడ్డారని అన్నారు.


ఏపీ అసెంబ్లీ


రాజధాని విషయంలో రైతులకు అన్యాయం జరుగుతుందని మేం ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తుంటే.. పవన్ కళ్యాన్ ఒక్కసారి గట్టిగా మాట్లాడితే.. చంద్రబాబు ఎందుకు  భయపడుతున్నారని ఆమె అన్నారు. గతంలో చిదంబరాన్ని చీకట్లో కలిసి కేసులు రాకుండా చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు ఓటుకు నోటు కేసు నుంచి బయటపడడానికి కేంద్రంతో రాజీపడుతున్నారని రోజా ఆరోపించారు. చంద్రబాబు మహిళా వ్యతిరేకిగా ఉన్నారని, కొడుకు పుడితే అత్తవద్దంటుందా అని సామెతలు చెబుతున్నారని అన్నారు. వనజాక్షి పై దాడి , రిషితేశ్వరి ఆత్మహత్య వంటి ఘటననలలో ఆయన ప్రవర్తించిన తీరు అలాగే ఉందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: