పశ్చిమగోదావరి జిల్లాలో  ఇంజక్షన్ నిడిల్ తో ఓ సైకో మహిళలను టార్గెట్ చేసి మరీ గుచ్చిపోతున్నాడు.. ఇప్పటికీ ఈ సైకో బారిన పడ్డవారు 19 మందికి చేరుకున్నారు.ఇప్పటి వరకు ఒకే సైకో అనుకున్నారు కానీ పోలీసులు ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సూదులు, ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే వీరే పక్క సైకోలు అని చెప్పలేమని పోలీసులు అంటున్నారు. ఈ వారంలో సైకోలు తమ వింత ప్రవర్తనతో మహిళలను భయబ్రాంతులకు గురి చేశాడు.    మనుషుల్ని చంపేయడం లేదు ఆ సైకో.. జస్ట్‌ 'సూది'తో జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. అయితే ఇతడి టార్గెట్ ఏమిటో ఎవరికీ అర్థం కాక భయం గుప్లిట్లో బతుకుతున్నారు.

ఎక్కడి నుంచి వస్తున్నాడో ఎలా వస్తున్నాడో ఎవరికీ తెలియదు. వస్తున్నాడు, సూది పోటు పొడిచేసి పారిపోతున్నాడు. బైక్‌ మీద వస్తున్నాడన్నది ఇప్పటిదాకా బాధితులు చెబుతున్నమాట.పెంటపాడు మండలం గట్లపాలెంలో ఓ బాలుడికి ఇంజక్షన్ ఇచ్చి సైకో పరారయ్యాడు. పెనుగొండ, సిద్ధాంతం, కవిటం, బుదరాయుడు చెరువు గ్రామాల్లో ఆడవాళ్లకు ఇంజక్షన్ ఇచ్చి పరారయ్యారు. పల్సర్ వాహనంపై హఠాత్తుగా వచ్చిన ఇద్దరు యువకులు ఇంజక్షన్ చేసి మాయమయ్యారని బాధిత మహిళలు చెబుతున్నారు. ఇంజక్షన్ తో మత్తుకమ్మి పడిపోతున్నారు మహిళలు. సైకోల భారినపడ్డ మహిళలకు దగ్గర్లోని ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.  

సైకో బారిన పడి చికిత్స పొందుతున్న బాధితులు


ఎట్టకేలకు  ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజలకు ఇంజక్షన్లు వేస్తున్న సైకోలుగా అనుమానిస్తూ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామంలో ఓ వ్యక్తిని, తూర్పు గోదావరి జిల్లా బొబ్బర్లంకలో మరో యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోదాల్లో భాగంగా వీరి నుంచి బైక్, సూదులను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. రావులపాలెం పోలీసు స్టేషనుకు తరలించి వీరిని విచారిస్తున్నట్టు సమాచారం. వీరిలో ఒకరు కడియం మండలం బుర్రెలంక గ్రామానికి చెందినవాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి. వీరే సైకోలని అప్పుడే నిర్థారణకు రాలేమని, వీరి వద్ద సూదులు ఎందుకు ఉన్నాయన్న విషయమై విచారణ జరుపుతున్నామని పోలీసులు వివరించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: