మనిషి ఎంతటి ఆరోగ్య కరమైన చర్యలు పాటించినా ఎంత శుచీ శుభ్రతలు పాటించిన కొన్ని కొన్ని సార్లు మన శరీరం మన ఆధీనంలో ఉండదు. ఫంగస్ రూపంలో ఎక్కడో అక్కడ దురద లాంటింది వస్తుంది. దీంతో పది మంది ముందు సిగ్గూ, బిడియం ఏర్పడుతుంది. సాధారణంగా దురద అనేది ఇబ్బందికరముగా ఉండే ఒక సమస్య అని చెప్పవచ్చు. దురద రావటానికి అలెర్జీలు, పురుగులు కుట్టడం,వాతావరణకాలుష్యం,అంటువ్యాధులు,సబ్బుల్లో కఠినమైన రసాయనాలు మరియు మందుల వంటి కారణాల వలన రావచ్చు. దురద సమస్య చాలా బాధకరముగాను మరియు చాలా చికాకుగాను ఉంటుంది.

మీరు ఉపశమనం కొరకు ఈ నివారణ మార్గాలను పాటించటం చాలా సులువైనది.   ఈ సమస్య ప్రతిఒక్కరినీ చికాకు పెట్టిస్తుంది. ఇది ఒక్కసారి వస్తే చాలు.. ఒళ్లంతా మంటగా, దురదగా వుంటుంది. ఈ దురద పెట్టడానికి ముఖ్య కారణాలు ఏమిటంటే.. అలర్జీ, ఇతర స్కిన్ డిసీజ్ లు, డ్రై స్కిన్, హెచ్ ఐవిఎస్, శరీరంలో పేలు, తామర, తట్టు, చర్మంపై ఫంగల్, ఇన్ఫెక్షన్, డ్రైపర్ రాషెష్, ఎరువుల పాయిజనింగ్, ఫుడ్ అలర్జీ, డ్రగ్ అలర్జీ, కీటకాలు కాటు మొదలైనవి. ఈ సమస్య వచ్చినప్పుడు సహజంగా అందరూ గోకటం లేద స్ర్కబ్ చేస్తారు. అలా చేస్తే.. సున్నితమైన చర్మం గాయపడటమే కాకుండా అందవిహీనంగా తయారవుతారు.

దురదతో  ఎన్నోభాదలు


ఒళ్లంతా చాలా మంటగా అనిపిస్తుంది. అంతేకాదు.. గోకడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఇతర భాగాలకు కూడా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి.. ఈ సమస్య వచ్చినప్పుడు గోకడం మానేసి.. ఇంటి చిట్కాలను పట్టిస్తే చాలు. తక్షణమే ఉపశమనం పొందవచ్చు. మరి.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా…


తులసి : ఈ ఆకుల్లో ఔషధగుణాలు ఎక్కువ మోతాదులో పుష్కలంగా వుంటాయి. ముఖ్యంగా దురద నుంచి ఉపశమనం కలిగించే కార్పూరం, థైమోల్ వంటివి వుంటాయి. అలాగే ఇంకా ఇందులో వుండే యాంటీసెప్టిక్ లక్షణాలు చర్మంలోని ఇన్ఫెక్షన్ ను నాశనం చేస్తాయి. ఇన్ని ప్రయోజనాలు దాగివున్న ఈ తులసిని పేస్టులా తయారుచేసుకుని.. చర్మం దురదగా వున్న ప్రదేశంలో అప్లై చేయాలి. వెంటనే ఫలితం తెలుస్తుంది.

పుదీనా : ఇందులో యాంటి సెప్టిక్ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను నివారించే రెమెడీల్లో చాలా మంచి రెమెడీగా గుర్తింపు పొందింది. అలాగే.. ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల వాటి ద్వారా వచ్చే దురదను కూడా అరికడుతుంది. ఇంకా వాపు, చికాకును తగ్గిస్తుంది. పుదీనా రసాన్ని దురద ఉన్న ప్రదేశంలో అప్లై చేసి, మసాజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే.. దురద తగ్గి, చర్మానికి కూలింగ్ ఎఫెక్ట్ ను కలిగిస్తుంది.

వేపాకు : చర్మం దురద నివారణకు ఇది బెస్ట్ రెమెడీ. ఇందులో యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ను నాశనం చేస్తుంది. అంతే కాదు.. దురద, చికాకు, ఇన్ఫ్లమేషన్ లను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. ఇది చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది. వేపనూనెను దురద ఉన్న ప్రదేశంలో అప్లై చేస్తే.. తక్షణం ఉపశమనం పొందవచ్చు.

నిమ్మరసం : నిమ్మకాయలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ పుష్కలంగా వుంటాయి. అవి ఇరిటేషన్, ఇన్ఫ్లమేషన్, చర్మం మీద దద్దుర్లును నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. అలాగే దురద వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ నివారించడంలో నిమ్మ సహాయపడుతుంది. చర్మ దురదగా ఉన్న ప్రదేశంలో నిమ్మరసం అప్లై చేయాలి.

కొబ్బరి నూనె : చర్మం దురదగా వున్న ప్రదేశంలో గోరువెచ్చగా వున్న కొబ్బరినూనెను అప్లై చేసి.. సున్నితంగా మసాజ్ చేయాలి. ఇది చర్మానికి మాయిశ్చరైజ్ గా పనిచేసి.. దురదను నివారిస్తుంది.

కరక్కాయ చూర్ణం బెల్లం తో కలిపి తినాలి (అజీర్ణం నివారణకు కూడా ఇదే మందు). 

మరింత సమాచారం తెలుసుకోండి: