సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు గుంటూరు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ గల్లా జయదేవ్  సోమవారం రాత్రి బైక్‌పై నుంచి కింద పడటంతో తీవ్ర గాయాలు అయ్యాయి వెంటనే ఆయను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన పరిస్థితిపై డాక్టర్ల సమీక్ష చేస్తున్నారు.  ఆయన కుమారుడికి స్పోర్ట్స్ బైక్ చాలా ఇష్టం తనయుని కోరిక మేరకు గల్లా జయదేవ్ సోమవారం రాత్రి  స్పోర్ట్స్ బైక్ కొనుగోలు చేయడానికి షోరూంకు వెళ్ళారు.

అక్కడ నుంచి బైక్ ట్రయల్ రన్ జరపడానికి మెకానిక్‌తో కలసి బైక్‌పై వెళ్ళారు. దాని స్పీడును పరీక్షించే ప్రయత్నంలో స్కిడయ్యి కింద పడ్డారు.  అసలే   స్పోర్ట్స్ బైక్ అత్యంత వేగం ఇక జయదేవ్ స్పీడును పరీక్షించే ప్రయత్నంలో స్కిడయ్యి కింద పడ్డారు. దీంతో ఆయన పక్కటెముకలకు తీవ్రమైన దెబ్బలు తగిలినట్లు తెలుస్తోంది.

పక్కన ఉన్న వారు వెంటనే గమనించి ఆయనను అక్కడి నుంచి పక్కకు తీసి తక్షణమే అపోలో ఆసుపత్రికి తరలించారు. కాగా, ఎంపీ గల్లా జయదేవ్.. టాలీవుడ్ హీరో మహేశ్ బాబుకు స్వయానా బావ. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని డాక్టర్ అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: