భారత దేశంలో ఎక్కువ శాతం మద్యతరగతి జీవితాలు గడుపుతున్న వారే ఉన్నారు. వచ్చిన జీతంలో ఇంటి ఖర్చులు..పిల్లల ఖర్చులు పోగా కాస్తో కూస్తో దాచుకోవాలని ప్రయత్నించే వారు చాలా మంది ఉంటారు. వారికోసం కొన్ని చిట్ ఫండ్స్.. బ్యాంకులు లాంటి పుట్టగొడుగుల్లా పుట్టకు వస్తున్నాయి అలా పుట్టుకు వచ్చిందే.. అగ్రిగోల్డ్. ఇందులో డబ్బులు దాచుకుంటే అధికంగా లాభాలు పొందవచ్చని పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయని ఎక్కు వడ్డీ వస్తుందని ఇలా రక రకాలుగా ప్రజలను మభ్యపెట్టి ఆశచూపి డబ్బు అందినంత నొక్కారు. కొంత కాలం తర్వాత ప్రజలకు కుచ్చు టోపీ పెట్టారు.దీనిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు.

అగ్రిగోల్డ్ కేసులో హైకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను చేపట్టిన హైకోర్టు.. రెండ్రోజుల్లోగా సంస్థకు ఉన్న ఆస్తులు, కంపెనీ వివరాలను వెల్లడించాలని అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ఆదేశించింది. అదే విధంగా అగ్రిగోల్డ్ అనుబంధ సంస్థల వివరాలను తెలపాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు, కేసు విచారణ పూర్తి అయ్యేంత వరకు అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మమని ప్రమాణ పత్రాలు ఇవ్వాలని ఆదేశించింది.


అగ్రిగోల్డ్ 


అగ్రిగోల్డ్కు ఉన్న ఆస్తులు, కంపెనీల వివరాలు ఎల్లుండిలోగా సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను బుధవారం నాటికి వాయిదా వేసింది. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులకు చెల్లించాలని ఇదివరకు నిర్ణయించిన సంగతి తెలిసిందే.ఇదే సమయంలో ఇంతవరకు నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. 154 ఆస్తుల వివరాలు తెలపాలని అగ్రిగోల్డ్ యాజమాన్యానికి హైకోర్టు ఆదేశించింది. అనంతరం కేసు విచారణను గురువారాని(సెప్టెంబర్ 3)కి వాయిదా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: