అసెంబ్లీ ఓ ప్రజాస్వామ్యవేదిక. ఇక్కడ జరిగే చర్చలను రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఏం మాట్లాడినా.. ఎలాంటి చర్య తీసుకున్నా.. జాగ్ర్తత్తగా చేయాలి. అసెంబ్లీలో అందరి కళ్లూ ఎక్కువగా ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేతలపైనే ఉంటుంది. వారి ప్రవర్తన ఎలాంటిదైనా అది హైలెట్ అవుతుంది. అపారమైన అనుభవం ముఖ్యమంత్రికి ప్లస్ పాయింట్ అయితే.. మొట్టమొదటిసారి అసెంబ్లీలో కూర్చోవడం ప్రతిపక్షనేత జగన్ కు మైనస్ పాయింట్.

ఈ అనుభవాన్నే తన అస్త్ర్రంగా ప్రయోగిస్తున్నారు ముఖ్యమంత్రిం చంద్రబాబు.. దీనికితోడు జగన్ మొదటి నుంచి దూకుడుగా వెళ్లడం సభను పదే పదే అడ్డుకోవడం వంటి చర్యలతో కాస్త బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటున్నారు. ఆయన అయినదానికి కాని దానికి సభాపతిపై విమర్శలు చేయడం ద్వారా జగన్ తన గౌరవాన్ని తానే తగ్గించుకుంటున్నారు.  జగన్ దూకుడు స్వభావాన్ని గమనించిన చంద్రబాబు దాన్ని ఆసరాగా తీసుకుని ఓ ఆటాడుకుంటున్నారు. 

అసెంబ్లీ సమావేశాల రెండో రోజు కూడా అదే సీన్ చోటుచేసుకుంది. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి సుదీర్ఘ ప్రసంగం చేస్తున్న సమయంలో జగన్ అడ్డుపడ్డారు. ప్రత్యేకించి తెలంగాణ ప్రభుత్వం తమపై పెత్తనం చేస్తోందని చెబుతూ ఓటుకు నోటు కేసును ప్రస్తావించినప్పుడు జగన్ ఏవో కామెంట్లు చేశారు. దాంతో సీఎం ఒక్కసారిగా రెచ్చిపోయారు. 

నేను జీవితంలో ఏ తప్పూ చేయలేదు.. చేయను.. నాతో పెట్టుకున్న వాళ్లు ఏమయ్యారో అందరికీ తెలుసంటూ వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై పరోక్షంగా రంకెలు వేశారు. నా పక్క ధర్మం ఉంది కాబట్టి ఎవరికీ భయపడనని చంద్రబాబు ఆవేశంగా అన్నారు.. ఏం మీకు సెక్షన్ 8 మాత్రం కనిపించదు గానీ.. ప్రత్యేక హోదా మాత్రమే కనిపిస్తుందా.. అంటూ జగన్ పై సెటైర్లేశారు. మీ పార్టీ వాళ్లు రెండు కొంటే ఒకటి ఫ్రీ అంటూ ఎమ్మెల్యేలను అమ్మేస్తున్నారంటూ జగన్ పై హాట్ కామెంట్లు చేశారు. మొదటిసారి సభకు వచ్చి తెలిసీ తెలియకుండా మాట్లాడొద్దని చురకలు వేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: